శ్రీరెడ్డి డైలీ సీరియల్ టైప్‌లో సినిమా ఇండస్ట్రీలో పెద్దల ముసుగులో ఉన్న పలువురి భాగోతాలు బయటపెడుతోంది. 'మా' తీసుకున్న నిర్ణయంతో ఆమె మరింతగా చెలరేగిపోతోంది. దీనికి ఓ విధంగా 'మా' కూడా కారణమనే చెప్పాలి. ఇందులో నిజనిజాలను నిగ్గుతేల్చి నిజాయితీని నిరూపించుకోకుండా తమ ఆధిపత్య ధోరణి చూపించడంతో శ్రీరెడ్డి తాజాగా వారి ఫోటోలు, చాటింగ్‌లను కూడా బయటపెడుతోంది. ఇప్పటి వరకు ఎవరో అనిల్ కడియాల అనే కొత్త దర్శకుడు, ఇండియన్ ఐడల్ సింగర్ శ్రీరామచంద్ర, వైవా హర్షల పేర్లు బయటపెట్టిన ఆమె తాజాగా మరో అడుగు ముందుకేసి దగ్గుబాటి సురేష్‌బాబు పుత్ర రత్నం అభిరామ్‌తో కలిసి ఉన్న ఫొటోలను విడుదల చేసింది.
ఇక రామానాయుడు స్టూడియోలోనే అభిరామ్ తనని అనుభవించాడని అంటోంది. తాజాగా ఆమె రచయిత, నిర్మాత కోనవెంకట్‌పై సంచలన ఆరోపణలు చేసింది. కోనవెంకట్ తనని శారీరకంగా బలవంతంగా వాడుకున్నాడని ఓ చానెల్ డిబేట్‌లో తెలిపింది. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డు నెం 12లో వున్న శ్మశానం వెనక కోనవెంకట్‌కి ఓ గెస్ట్‌హౌస్ ఉందని, ఆయన ఫోన్ చేసి తనని అక్కడకి రమ్మన్నాడని కోరాడని తెలిపింది. ఇక్కడకు రోజూ వివి వినాయక్ కూడా వస్తుంటాడు. ఆయన్ని పరిచయం చేస్తానని చెప్పిన కోన వెంకట్ తాను ఆ గెస్ట్‌హౌస్‌కి వెళ్లగానే మందు తాగమని బలవంతం చేశాడని, తర్వాత తనను లైంగికంగా బలవంతంగా అనుభవించాడని చెప్పింది.
దీనిపై కోనవెంకట్ లీగల్ యాక్షన్స్ తీసుకుంటానని చెప్పాడు. మరోవైపు తాను కూడా లీగల్‌గానే ప్రొసీడ్ అవుతానని శ్రీరెడ్డి తెలిపింది. ఇక శ్రీరెడ్డికి పలు మహిళా సంఘాలతో పాటు ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధులు కూడా మద్దతు తెలపడంతో ఈ గొడవ చినికి చినికి గాలి వానలా మారుతోందని చెప్పాలి.