ప్రస్తుతం రంగస్థలం, ఛల్ మోహన్ రంగ సినిమాల కలెక్షన్స్ తట్టుకుని కృష్ణార్జున యుద్ధం సినిమాతో థియేటర్స్ లోకొచ్చేశాడు. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మొదటి షోకే హిట్ టాక్ తెచ్చుకున్న కృష్ణార్జున యుద్ధం సినిమా నానికి మరోసారి విజయాన్ని అందించింది. ఇప్పటి వరకు ఎనిమిది హిట్స్ తో దూసుకుపోతున్న నాని తొమ్మిదో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ హిట్ తో నానికి ఇండస్ట్రీలో ఎదురు లేకుండా పోయింది. అయితే ఈ సినిమా తర్వాత నాని, నాగార్జునతో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ లోపు నాని టాప్ డైరెక్టర్ కొరటాల శివతో కలిసి ఒక సినిమా చెయ్యబోతున్నాడంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
కొన్నిసార్లు ఇవన్నీ కేవలం రూమర్స్... నానినే కావాలని ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నాడంటూ ఏవేవో కథనాలు కొన్ని చోట్ల కనిపించాయి. అయితే నాని మాత్రం అసలు కొరటాలతో నేనా? అంటున్నాడు. ఇలాంటి వార్తలన్నీ ఎందుకు పుడతాయో తెలియదు గాని... నిన్నుకోరి సినిమా చేస్తున్నపుడు ఒకసారి కొరటాల శివ గారిని కలిశానని.. ఆ తర్వాత మళ్ళీ కొరటాల శివతో నేను కలవలేదని.. అలాంటిది ఆయన డైరెక్షన్ లో నేను నటించడమేమిటంటూ... అసలు ఈ వార్తలు నేను మీడియాలో చూసి ఆశ్చర్యపోయానని కూడా చెబుతున్నాడు. అసలు మా మధ్యలో ఎలాంటి సినిమా ప్రపోజల్ రాలేదని ఫుల్ గా క్లారిటీ ఇచ్చేశాడు.
అలాగే తన చేతిలో ప్రస్తుతం మల్టీస్టారర్ తప్ప మరో మూవీ లేదని... కానీ నాలుగైదు కథలు మాత్రం లైన్ లో ఉన్నట్టుగా చెప్పాడు నాని.