Advertisementt

యూఎస్ లో కేవలం సమంతకే ఈ రికార్డు!

Fri 13th Apr 2018 02:46 PM
samantha,million dollar baby,us record,rangsthalam  యూఎస్ లో కేవలం సమంతకే ఈ రికార్డు!
Samantha million dollar Queen యూఎస్ లో కేవలం సమంతకే ఈ రికార్డు!
Advertisement
Ads by CJ

ఆ హీరో రికార్డ్స్ నెలకొల్పాడు..లేదా ఈ హీరో రికార్డ్స్ నెలకొల్పాడు అని అలా హీరోస్ గురించే మాట్లాడుకుంటాం. కానీ హీరోయిన్స్ గురించి మాట్లాడుకోము. సినిమాల్లో వాళ్ల వంతు కూడా ఉంటుంది కదా..కానీ రికార్డుల మాటెత్తితే పాపం హీరోయిన్ల ఊసే ఉండదు. అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం ఆ రికార్డ్స్ ని మరిచిపోవడం లేదు. రంగస్థలం సినిమా యూఎస్ లో నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే.

లేటెస్ట్ గా ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరడంతో సమంత ఖాతాలో 13 మిలియన్ డాలర్ల సినిమాలు అంటూ సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా 3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అసలు విషయం ఏంటంటే యూఎస్ లో తొలి మిలియన్ డాలర్ సినిమాగా నిలిచిన ‘దూకుడు’లో సమంతే హీరోయిన్. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ‘దూకుడు’ తర్వాత ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, 24, తెరి, బ్రహ్మోత్సవం, అఆ, జనతా గ్యారేజ్, మెర్శల్, రంగస్థలం’ సినిమాలు మిలియన్ డాలర్ మార్కును దాటాయి అంటూ సామ్ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు.

ఇప్పటివరకు సౌత్ లో ఏ హీరోయిన్ కు ఇటువంటి రికార్డు లేదు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ రికార్డు మన తెలుగులో ఏ హీరోకి కూడా లేదు. మొన్నటి వరకు సమంత నటించిన ‘అఆ’ బిగ్గెస్ట్ హిట్‌గా ఉందక్కడ.ఆ చిత్రం 2.45 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. అయితే ఇప్పుడు ‘అఆ’ సినిమా రంగస్థలం ఆ రికార్డుని బ్రేక్ చేసింది సమంత. ప్రస్తుతం ఆమెను అంతా ‘మిలియన్ డాలర్ బేబీ’ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.

Samantha million dollar Queen:

Samantha is nicknamed 'Million Dollar baby'

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ