సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే కేవలం కోలీవుడ్ లోనే కాదు పక్క రాష్ట్రాలైన టాలీవుడ్ లలో కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారు. అయితే రజినీకాంత్ కబాలి తర్వాత మరో మూవీ ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. శంకర్ తో కలిసి చేసిన 2.0 సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా.. గ్రాఫిక్స్ పనుల వల్ల ఎప్పుడు విడుదలవుతుందో కూడా అర్ధం కాక నిర్మాతలు తలలు పట్టుకున్నారు. ఇక సూపర్ స్టార్ అభిమానులైతే నిరాశ నిస్పృహల్లోకి వెళ్లిపోయారు. పోనీ కాలా సినిమాతో అయినా పండగ చేసుకుందామని డిసైడ్ అయ్యారు.ఇక కాలా సినిమా కూడా ఆగష్టు నుండి ఏప్రిల్ 27 కి ప్రీ పోన్ అయ్యింది.
అయితే ప్రస్తుతం కాలా సినిమా విడుదలకు సర్వం సిద్ధం. కానీ తమిళనాడులో నిర్మాతల మండలి సర్వీస్ ప్రొవైడర్స్ కి మధ్యన జరుగుతున్న వివాదం కారణంగా సినిమాలు థియేటర్స్ లో విడుదల కావడం లేదు. ప్రస్తుతం తమిళనాట థియేటర్స్ సమ్మె నడుస్తున్న కారణంగా అక్కడ విడుదలకు రెడీ అయిన సినిమాలన్ని వాయిదాలు వేసుకుంటున్నాయి. అందులో భాగంగానే కాలా నిర్మాత ధనుష్ కాలా సినిమా విడుదలను వాయిదా వేశాడు. ఆఫీషియల్ గా ప్రకటించాడు కూడా. మరి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కూడా వాయిదా పడేసరికి ఇంకా ఢీలా పడ్డారు. అయితే కాలా సినిమా జూన్ కి వెళ్లినా వెళ్లొచ్చనే టాక్ ఉంది. మరి కాలా తో సూపర్ స్టార్ అభిమానులు బాధపడుతుంటే మరికొందరు మాత్రం పండగ చేసుకుంటున్నారు.
వారెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోస్ మహేష్ బాబు, అల్లు అర్జున్ లు. రజిని స్టామినాకి భయపడి తన సినిమాలను వాయిదా వేసుకున్న ఈ హీరోస్ కి కాలా ఏప్రిల్ 27 న వస్తుంది అనుకుని బాగానే టెంక్షన్ పడ్డారు. ఎందుకంటే మహేష్ కాలా సినిమాకి వారం ముందే థియేటర్స్ లో కొచ్చిన వారం తర్వాత రజిని క్రేజ్ ముందు డల్ అవ్వాల్సి వస్తుందని అనుకుని చిన్న పాటి టెంక్షన్ లోనే ఉన్నారు. అలాగే కాలా విడుదలైన వారానికే అల్లు అర్జున్ నా పేరు సూర్య తో వచ్చినా అప్పటికి కాలా ప్రభంజనం పూర్తిగా సర్దుమణుగుద్దో లేదో తెలియదు. కానీ ప్రస్తుతం కాలా విడుదల వాయిదా ఈ ఇద్దరి హీరోల నెత్తిన పాలు పోసింది. మరి మహేష్ భరత్ అనే నేనుతో రెండు వారాలు ఏక్ దమ్మున్న కలెక్షన్స్ కుమ్మస్తే... అల్లు అర్జున్ నాపేరు సూర్య తో వేసవి కాలంలో కూడా కూల్ గా బరిలోకి దిగి కలెక్షన్స్ రాబట్టొచ్చు. అదన్నమాట సూపర్ స్టార్ అభిమానులు బాధపడినా... మహేష్ అండ్ అల్లు అర్జున్ లు మాత్రం ఫుల్ హ్యాపీ.