Advertisementt

శ్రీరెడ్డికి బాలీవుడ్ టాప్ హీరోయిన్ మద్దతు!

Thu 12th Apr 2018 10:36 PM
kangana ranaut,support,sri reddy  శ్రీరెడ్డికి బాలీవుడ్ టాప్ హీరోయిన్ మద్దతు!
Kangana Ranaut advice to Sri Reddy శ్రీరెడ్డికి బాలీవుడ్ టాప్ హీరోయిన్ మద్దతు!
Advertisement
Ads by CJ

గత కొన్ని నెలలుగా సినిమా ఫీల్డ్‌లో తెలుగు అమ్మాయిల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని, అలాగే అవకాశాల పేరుతో అమ్మాయిలను లైంగికంగా వాడుకుని, తర్వాత వేషాలు మాత్రం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని శ్రీరెడ్డి అనే నటి పోరాటం చేస్తోంది. ఇది నిజమో కాదో పక్కన పెడితే దీని వల్ల టాలీవుడ్‌ పరువు, 'మా' ప్రతిష్టలు దెబ్బతిన్నాయని భావించిన 'మా' శ్రీరెడ్డికి సభ్యత్వం ఇవ్వమని, ఆమె ఏ చిత్రంలో నటించడానికి వీలు లేదని, ఆమె పక్కన ఎవరైనా నటిస్తే వారిని కూడా బహిష్కరిస్తామని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. అయినా పెద్దగా పేరు లేని శ్రీరెడ్డి మీద చర్యలు తీసుకున్న సినీ పెద్దలు 'బాలకృష్ణ అభిమానులతో ఆడవారికి కడుపుచేయండి' అన్నప్పుడు.. చలపతిరావు 'ఆడాళ్లు పక్కలోకి పనికొస్తారు..' అని వ్యాఖ్యలు చేసినప్పుడు ఈ సినీ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు?. 

ఇక శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనపై బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రౌనత్ స్పందించింది. కాస్టింగ్‌ కౌచ్‌ విషయంలలో శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళనకు తన మద్దతు ఉంటుందని, కానీ దానికి ఆమె ఎంచుకున్న మార్గాన్ని మాత్రం తాను అంగీకరించనని తేల్చిచెప్పింది. కాస్టింగ్‌కౌచ్‌ వంటి వ్యవహారాలు కేవలం సినీరంగంలోనే కాదు.. అన్ని రంగాలలో ఉన్నాయి. చిత్ర పరిశ్రమలో చాలా మంది యువతులు ఇబ్బందులు పడుతున్నారు. నేను కూడా అలాంటి ఇబ్బందులు పడిన దానినే. 

అర్ధనగ్న ప్రదర్శన వల్ల ఆమెకి మద్దతు తెలపాలని భావించిన వారు కూడా వెనక్కి తగ్గారని, జరుగుతున్న అన్యాయాన్ని చెబుతూ, పోరాడుతున్న సమస్యకు ప్రచారం దక్కేలా శ్రీరెడ్డి వ్యవహరించాలని కోరింది. కానీ ఈ అర్ధనగ్న ప్రదర్శన వల్ల అసలు విషయం మరుగున పడుతోందని.. ఇప్పుడున్న బాధితులు, గతంలో బాధించబడిన వారు బహిరంగంగా బయటకు రావాలని ఆమె సూచించింది. 

Kangana Ranaut advice to Sri Reddy:

Kangana Ranaut Support To Sri Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ