'అఖిల్' డిజాస్టర్, 'హలో' యావరేజ్, కానీ ఇపుడు వెంకీ అట్లూరితో కలిసి తన మూడో ప్రాజెక్ట్ ని మొదలు పెట్టిన అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని తహతహ లాడుతున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ దగ్గరనుండి, స్టోరీ సిట్టింగ్స్ కూడా పూర్తవడమే కాదు... సినిమా ఆఫీషియల్ గా పట్టాలెక్కేసింది కూడా. తొలిప్రేమ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి... అఖిల్ తో చేసే సినిమాని కూడా ప్రేమ కథగా మలిచి అఖిల్ కి మంచి హిట్ అందించాలని డిసైడ్ అయ్యాడట. థాయిలాండ్ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు.
నితిన్ హీరోయిన్ మేఘ ఆకాష్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఆమెకి వరుస గా మొదటి సినిమా ప్లాప్ తో రెండో సినిమా యావరేజ్ టాక్ వలన అఖిల్ అండ్ టీమ్ ఆలోచనలో పడిందని, కాదు కాదు మేఘ ఆకాష్ తెలుగు సినిమాలు సైన్ చెయ్యకపోవడం వల్లే ఈ సినిమాలో నటించడం లేదని అనుకుంటున్నారు. దీంతో అఖిల్ 3 కి మరో హీరోయిన్ వేట కొనసాగుతున్నట్టుగా చెబుతున్నారు. అయితే రాశి ఖన్నా పేరు అఖిల్ 3 కోసం గట్టిగా వినపడుతుంది. ఇప్పుడు తాజాగా అఖిల్ 3 కోసం వెంకీ అట్లూరి ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ ని కూడా ప్లాన్ చేస్తున్నాడట. అయితే అఖిల్ పక్కన ఆ ఐటమ్ లో ఆడి పాడడానికి గాను రంగస్థలం ఐటెం గర్ల్.. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న పూజ హెగ్డే ని సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తుంది.
రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ పక్కన ఊర మాస్ స్టెప్స్ తో ఆకట్టుకున్న పూజ హెగ్డే ప్రస్తుతం ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇలాంటి టైం లో అఖిల్ కోసం ఐటెం అవతారం ఎత్తుతుందా అనేది పెద్ద డౌట్. కానీ నాగార్జున ద్వారా అయినా పూజ హెగ్డే ని ఒప్పించాలని వెంకీ అట్లూరి అనుకుంటున్నాడట. పూజ హెగ్డే ఐటెం అంటే సినిమాకి అదనపు ఆకర్షణ వస్తుందని వెంకీ అండ్ అఖిల్ అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. చూద్దాం పూజ హెగ్డే, అఖిల్ 3 కోసం ఐటెం చేస్తుందా లేదా అనేది.