Advertisementt

మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టే..!

Thu 12th Apr 2018 04:06 PM
balakrishna,mokshagna,ntr biopic,no entry  మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టే..!
Mokshagna Is Not Part Of NTR Biopic మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టే..!
Advertisement
Ads by CJ

నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. రీసెంట్ గా ఈ చిత్ర ఓపెనింగ్ చాలా గ్రాండ్ లెవెల్ లో నిర్వహించాడు బాలకృష్ణ. ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. ఈ సినిమాలో ఇతర పాత్రధారుల గురించి రోజుకొక్క న్యూస్ వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో నందమూరి ఫ్యామిలీతో పాటు మరి కొంత మంది బయట వాళ్లు కూడా నటిస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హరి కృష్ణ పాత్ర పోషిస్తున్నాడని గత మూడు రోజులు నుండి ఈ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అలానే కళ్యాణ్ రామ్ తో పాటు.. నారా రోహిత్.. తారక రత్న వంటి యాక్టర్లు చిన్నపాటి రోల్స్ లో కనిపించనున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ మూవీ లాంఛింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించక పోవడం బట్టి చూస్తే.. యంగ్ టైగర్ కనిపించేది అనుమానమే.

అయితే తాజాగా ఈ బయోపిక్ లో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ నటిస్తున్నాడనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ అయిపోయింది. మోక్షజ్ఞ ఎంట్రీ ఈ సినిమాతోనే అవ్వాలని డైరెక్టర్ తేజ ప్రపోజ్ చేశాడట. కానీ బాలకృష్ణ మాత్రం అందుకు నో చెప్పాడంట. దీంతో ప్రతిష్టాత్మక చిత్రంలో మోక్షజ్ఞ కనిపించే అరుదైన అవకాశం మిస్ అయి పోయినట్లే అని చెప్పుకోవాలి. మోక్షజ్ఞ లాంచ్ గ్రాండ్ లెవెల్ లో ఉండాలని అందుకే ఈ సినిమాలో నో చెప్పాడని తెలుస్తుంది. 

Mokshagna Is Not Part Of NTR Biopic:

>Balayya's Strict No To Mokshagna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ