తనకు 'మా'లో సభ్యత్వం ఇవ్వకపోవడం, తెలుగమ్మాయినైన తనకు అవకాశాలు ఇవ్వకుండా పరభాషావారికి అవకాశాలు ఇస్తూ, తెలుగమ్మాయిలను మోసంచేస్తున్నారని, అవకాశాల పేరుతో లైంగికంగా వాడుకుని కూడా అవకాశాలు ఇవ్వడం లేదని శ్రీరెడ్డి అనే నటి ఫిల్మ్‌చాంబర్ వద్ద టాప్‌లెస్‌గా, పైన ఎద స్థానంలో ఏమీ లేకుండా నిరసనకు దిగడం ఒక్కసారిగా హాట్‌టాపిక్ అయింది. ఈ వార్త నేషనల్ మీడియాలో కూడా బాగా ప్రచారంలోకి రావడంతో టాలీవుడ్‌కి తీవ్ర అవమానం జరిగింది. ఇక శ్రీరెడ్డి విషయంలో వర్మ కూడా సరిగ్గానే చెప్పాడు. పవన్‌కళ్యాణ్ అంటే ఎవరో కూడా తెలియని ముంబై వాసులకు ప్రస్తుతం శ్రీరెడ్డి తెలుసని, ఈమె నేడు జాతీయ సెలబ్రిటీ అయిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈమెతో రెండు చిత్రాలు తీయాలని భావించిన దర్శకనిర్మాత, తెలంగాణ ఫిల్మ్‌చాంబర్ ప్రెసిడెంట్ అయిన రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ఆమె నిరసన వ్యక్తం చేయడంలో తప్పులేదు. కానీ ఆమె నిరసనను తెలియజేసే క్రమంలో ఎంచుకున్న పద్దతి సరికాదు. మాలో సభ్యత్వం విషయంలో ఆలస్యమై ఉండవచ్చు. కానీ ఆమె ఇతర మార్గాల ద్వారా తన నిరసనను తెలిపి ఉంటే బాగుండేది. ఆమెతో రెండు చిత్రాలు చేయాలని భావించాను. కానీ 'మా' అసోసియేషన్ మాత్రం తమ సభ్యులెవ్వరూ ఆమెతో నటించడానికి వీలులేదని, ఆమెతో నటిస్తే వారిని కూడా బహిష్కరిస్తామని తెలిపింది...అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి రామకృష్ణగౌడ్ ఇవ్వాలని భావించిన రెండు చిత్రాల అవకాశాలు శ్రీరెడ్డి కోల్పోయినట్లేనని చెప్పాలి.
ఇక తేజ కూడా ఆమెకి బాలకృష్ణ 'ఎన్టీఆర్ బయోపిక్', వెంకటేష్‌తో 'ఆటా నాదే వేటా నాదే' అనే చిత్రాలలో చాన్స్‌ఇస్తానని ప్రకటించాడు. కానీ తేజ కూడా 'మా' నిర్ణయంవల్ల డ్రాప్ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఇక మరోపక్క శ్రీరెడ్డి తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఆమె రాజకీయ నాయకులపై మండిపడింది. గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఒక యువనటి న్యాయాన్ని అర్ధిస్తూ బట్టలు విప్పుకుని, నగ్నంగా నిలబడే స్థాయికి దేశాన్ని దిగజార్చిన రాజకీయనాయకులు, సినిమా వారుసిగ్గు పడాలి. చూడాల్సింది బట్టలు విప్పిన శరీరాన్నికాదు. జరిగిన అన్యాయాన్ని,ఆవేదనను చూడాలని కోరింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.