కొన్నిసార్లు అంతే.. తెలిసి చేసినా తెలియక చేసినా, ఉద్దేశ్యపూర్వకంగా చేసినా, ఎమోషన్‌లో చేసినా కూడా కొన్ని విషయాలు వివాదాస్పదం అవుతాయి. ఇక బన్నీ విషయానికి వస్తే పవన్ ఫ్యాన్స్‌తో 'చెప్పను బ్రదర్' నుంచి ఆ మధ్య కబాడీ లీగ్ సందర్భంగా కమల్‌హాసన్‌తో పాటు రామ్‌చరణ్‌తో హాజరై, కమల్ సాదాసీదాగా కూర్చుంటే బన్నీ మాత్రం లెక్కలేని తనంగా కాలుపై కాలు వేసుకోవడం తమిళ మీడియాలో తీవ్రంగా ప్రతిస్పందనలు వచ్చాయి. ఇక తాజాగా బన్నీ మరో అనుకోని వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే తనకు మోదీనే స్ఫూర్తి అని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం ఆగకముందే ఆయన 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' విషయంలో 'నార్త్ ఇండియా, సౌత్‌ఇండియా, ఈస్ట్ వెస్ట్ ఇన్ని ఇండియాలు లేవురా మనకి. ఒక్కటే ఇండియా' అనే డైలాగ్ విడుదలైంది. చూసేందుకు ఇది దేశభక్తి కంటెంట్‌తో కూడిన డైలాగే అయినా పవన్‌కళ్యాణ్ ఉత్తరాది, దక్షిణాది మధ్య వివక్షతను ఎత్తిచూపుతున్నతరుణంలో పవన్ మీద ఇది సెటైర్‌గా అందరికీ అనిపిస్తోంది.
'ఒకవైపు సౌతిండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ ఇండియాలు లేవు. ఒక్కటే ఇండియా' అని డైలాగ్ చెప్పిన బన్నీ తన పుట్టినరోజు కానుకగా కట్ చేసిన కేక్, బేనర్లలో సౌతిండియన్ స్టైలిష్ స్టార్ అని ఆయనకు బిరుదుగా రాయడంతో ఆయన పలువురు విమర్శకులకు పని కల్పించాడు. ఇన్ని ఇండియాలు లేనప్పుడు సౌతిండియన్ అని స్పెషల్‌గా మెన్షన్ చేస్తూ 'సౌత్ ఇండియన్ స్టైలిష్ స్టార్' అని వేసుకోవడం ఏమిటి? సినిమాలలో నీతులు చెబుతూ, బయట మాత్రం ఇలా ప్రవర్తించే వారిని ఏమి చేసినా తప్పులేదు. ఇక అసలే కేంద్రంలోని వారు ఉత్తరాది, దక్షిణాది తేడా చూపుతుండటం పట్ల పవన్‌కళ్యాణ్, సుమన్, కమల్‌హాసన్ నుంచి ప్రకాష్‌రాజ్ వరకు మండిపడుతూ ఉంటే.. బన్నీమాత్రం వారందరినీ అవమానించే విధంగా కేంద్రానికి మద్దతు తెలిపాడని, ఇది తమ మనోభావాలను, తమ అభిప్రాయాలను దెబ్బతీసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' చిత్రం మే 4వ తేదీన విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.