Advertisementt

పిల్లల కోసం ఓ టైమ్ పెట్టుకున్నాం: సమంత!

Thu 12th Apr 2018 01:00 AM
samantha,samantha akkineni,kids,naga chaitanya  పిల్లల కోసం ఓ టైమ్ పెట్టుకున్నాం: సమంత!
Samantha Akkineni Planning About Kids పిల్లల కోసం ఓ టైమ్ పెట్టుకున్నాం: సమంత!
Advertisement
Ads by CJ

టాప్ రేంజ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ... ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలి అన్నట్టుగా హీరోయిన్ సమంత తన లవర్ హీరో నాగ చైతన్యని పెళ్లాడింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు సమంత పెళ్లి చేసుకోవడమేమిటి అంటూ చాలామంది పెదవి విరిచారు. కానీ సమంత ముందు నుండి చెబుతున్నట్టుగా పెళ్లి వయసురాగానే పెళ్లి చేసుకుంది. అయినా కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టలేదు. పెళ్లయ్యాక కూడా భీభత్సంగా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్న సమంత ఇప్పట్లో పిల్లల్ని మాత్రం కనదంట.

కొద్దిగా గ్యాప్ దొరికినా భర్త నాగ చైతన్యతో కలిసి ఆనందంగా గడుపుతున్న సమంత ఇప్పుడప్పుడే పిల్లల గురించిన ఆలోచన చెయ్యడం లేదట. ప్రస్తుతం రంగస్థలం సినిమా ప్రమోషన్స్ లో సమంత పెళ్లి, పిల్లల ముచ్చట్లు కూడా చెప్పుకొచ్చింది. పిల్లల్ని కనేందుకు ఓ టైమ్‌ అనుకున్నామని.. ఆ టైమ్‌ వచ్చే వరకు తమ కెరీర్‌ గురించే తప్ప వేరే ఆలోచనలు చేయకూడదనుకున్నామని క్లారిటీ ఇచ్చేసింది. మరి చైతు తో సామ్ వివాహం జరిగిన కొన్ని నెలలకే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అని వార్తలు రావడం... అది అక్కినేని సమంతే అని పలువురు ఫిక్స్ అవడం.. అలా ఆ గాలి వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంపైనా సమంత స్పందించింది.

ప్రస్తుతం పిల్లల ఆలోచన లేదని చెబుతున్న సమంత ఒక్కసారి తాను తల్లిగా మారితే.... ఇక తనకు పిల్లలే ప్రపంచమని కూడా కుండబద్దలు కొట్టింది. మరి ఇలా సమంత చెబుతున్నదాన్ని బట్టి ఇక సమంత కొన్నాళ్ళకి కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నట్లుగానే అనిపిస్తుంది. మరి పిల్లలే ప్రపంచం అని చెబుతుంది అంటే ఇక సినిమాల్లో నటించదనేగా దానర్ధం.

Samantha Akkineni Planning About Kids:

Samantha opens up on having a baby with Naga Chaitanya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ