Advertisementt

రంగమ్మత్త మరో మెగా హీరో సినిమాలో..!

Wed 11th Apr 2018 01:31 PM
anasuya bharadwaj,f2,varun tej,venkatesh,anil ravipudi  రంగమ్మత్త మరో మెగా హీరో సినిమాలో..!
Anasuya Grabs Big Multistarrer రంగమ్మత్త మరో మెగా హీరో సినిమాలో..!
Advertisement
Ads by CJ

'రంగస్థలం'లో చిట్టిబాబుగా రామ్ చరణ్ కి, రామలక్ష్మి గా సమంతకి, ప్రెసిడెంట్ ఫణింద్ర భూపతిగా జగపతి బాబుకి, కుమార్ బాబుగా ఆది పినిశెట్టికి ఎంతగా పేరొచ్చిందో... రంగమ్మత్త పాత్రలో అనసూయ కి కూడా అంతే పేరొచ్చింది. రంగస్థలం ఫస్ట్ హాఫ్ లో రంగమ్మగా అనసూయ అదరగొట్టేసింది. అలాంటి పాత్రకి కొత్తే అయినా ఆ పాత్రలో అనసూయ జీవించింది. ఎంత వయసున్నప్పటికి హీరోయిన్స్ కి పోటీనిచ్చే అందంతో అనసూయ హాట్ యాంకర్ గా వెలుగొందుతుంది. అలాంటి టైం లో అనసూయ రంగమ్మ పాత్ర ఎందుకు ఒప్పుకుందో అనుకున్నవారికి ... సినిమా చూశాక నోటమాట రాలేదు.

మరి రంగస్థలంలో రంగమ్మగా అనసూయ పెరఫార్మెన్స్ కి దర్శక నిర్మాతలు ఫిదా అయ్యారట. అందుకే అనసూయ కి వరుసగా తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తామంటూ బయలుదేరారట. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ లో అనసూయ ఒక కీ రోల్ ఆఫర్ చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. వెంకటేష్ - వరుణ్ తేజ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనసూయ కి ఎలాంటి పాత్ర ఇస్తారో తెలియదు కానీ.. ఆమెకి ఒక రోల్ ఆఫర్ చేసినట్టు.. ఆ పాత్ర అనసూయకి నచ్చి ఓకె చేసినట్టుగా తెలుస్తుంది. మరి మళ్ళీ అనసూయ కి అత్తలాంటి పాత్ర ఎమన్నా ఆఫర్ చేశారో.. లేదంటే హీరోయిన్ కి అక్కో చెల్లెలి పాత్ర ఇచ్చారో మరి అనసూయ వెంటనే ఓకె చేయడానికి.

ఎందుకంటే ఇప్పటివరకు తనకు సరిపడ పాత్రలు (హీరోయిన్ పాత్రలు) రావడం లేదంటూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో అదరగొట్టే అనసూయకి సినిమాలో కీ రోల్స్ ఇస్తే ఓకే గాని.. అల్లాటప్పా పాత్రలిస్తే  మాత్రం ఆమె చెయ్యదు. మరి అలాగయితే డైరెక్టర్స్ అనసూయ కోసం ఇంపార్టెన్స్ పాత్రలను క్రియేట్ చెయ్యాల్సిందే. ఇక అనిల్ రావిపూడి.. అనసూయకి ఎలాంటి కేరెక్టర్ ఇచ్చాడో అనేది చూడాలి.

Anasuya Grabs Big Multistarrer:

Anasuya Bharadwaj to play key role in Venkatesh and Varun Tej's F2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ