ఈమధ్య కేంద్రంలోని బిజెపి సర్కార్‌కి వ్యతిరేకంగా గళం ఎత్తుతు, దేశంలో అసహనం పెరిగిపోయిందని, గౌరీలంకేష్ వంటి వారిని చంపడం వెనుక అసహనమే కారణమని, దానిని బిజెపి పెంచి పోషిస్తోందని చెబుతున్నాడు ప్రకాష్‌రాజ్. మరి ప్రజల అసహనం ఏమో తెలియదు గానీ ప్రకాష్‌రాజ్‌లో మాత్రం అసహనం బాగా కనిపిస్తోంది. సినిమా వేడుకలంటే వేలలో, లక్షల్లో జనాలు వస్తారు. అందునా ఎల్బీ స్టేడియం వంటి చోట అయితే లక్షల మంది కిక్కిరిసి పోతారు. ఇక సాధారణంగా ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు లక్షల్లో ఉండే జనాన్ని, అభిమానులను కంట్రోల్ చేయడం సాధ్యంకాదు. ఇక మెగాస్టార్ చిరంజీవి వేడుకలోనే పవర్‌స్టార్.. పవర్‌స్టార్ వంటి నినాదాలు వినిపిస్తూ ఉంటాయి. వాటిని లైట్‌గా తీసుకుని వెళ్తుంటారు. కానీ అసహనం ఎక్కువగా ఉండే బన్నీ మాత్రం 'చెప్పను బ్రదర్' అని అన్నాడు. దానికి ఫలితం కూడా అనుభవిస్తున్నాడు. ఇక ప్రకాష్‌రాజ్ చేసే పనులన్నీ క్రమశిక్షణ లేకుండా ఉంటాయని, ఆయనకు నిర్లక్ష్యం ఎక్కువని, ఆయన వల్లే లేటయిన సినిమాలు ఎన్నో ఉన్నాయని చెబుతారు.
ఇక విషయానికి వస్తే 'భరత్‌అనే నేను'వేడుకలో ఎన్టీఆర్, మహేష్‌ని అన్నయ్య అని పిలవడం, మహేష్ కూడా తారక్‌ని తమ్ముడు అని సంబోధించడం తెలిసిందే. ఇదే సమయంలో ప్రకాష్‌రాజ్ స్పీచ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. దాంతో కొందరు ఆయనను 'ఫాదర్, ఫాదర్' అని అరిచారు. బహుశా ఆయన ఎక్కువగా తండ్రి పాత్రలు చేయడమే దానికి కారణమో, లేక అంతర్లీనంగా మరేదైనా ఉందేమో తెలియదు గానీ 'ఫాదర్, ఫాదర్' అని పిలవడంతో నవ్వుతూ కాసేపు కామ్‌గా ఉండిపోయాడు. మరోసారి ప్రసంగానికి రెడీ అవుతుండగా, మరోసారి 'ఫాదర్, ఫాదర్' అని పిలుపులు వినిపించే సరికి అసహనానికి లోనైన ప్రకాష్‌రాజ్ ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయాడు. యాంకర్ సుమ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా ప్రకాష్‌రాజ్ వెళ్లిపోయాడు. సో.. ఈ విషయంలో గమనిస్తే ఈ మధ్య ప్రకాష్‌రాజ్‌కి అసహనం ఎక్కువైందని అనిపించక మానదు.