Advertisementt

కళామతల్లికి జరిగిన అవమానం అంటోంది!

Tue 10th Apr 2018 08:14 PM
sri reddy,allegations,sensation,tollywood  కళామతల్లికి జరిగిన అవమానం అంటోంది!
Sri Reddy Fires on Top Celebrities and Political Leaders కళామతల్లికి జరిగిన అవమానం అంటోంది!
Advertisement
Ads by CJ

అవకాశాలు ఇస్తామని కాస్టింగ్‌ కౌచ్‌లకు పాల్పడతారని తెలుసుగానీ, లైంగికంగా తనతో సెక్స్‌ కూడా చేసి అవకాశాలు ఇవ్వలేదని కొత్త రాగం అందుకున్న నటి శ్రీరెడ్డి. ఇక ఈమె శేఖర్‌కమ్ముల, శేఖర్‌సూరి, పుప్పాల రమేష్‌, ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌ శ్రీరామచంద్ర, ఇక తాజాగా యూట్యూబ్‌ సెలబ్రిటీ వైవాహర్షా కూడా తనని వేధింపులకు గురి చేశారని, వైవాహర్ష తనతో పలు అసభ్యకరంగా చాట్ చేశాడని తన ఫోన్‌లోని చాటింగ్‌ స్క్రీన్‌ షాట్లను తన ఫేస్‌బుక్‌లో బయటపెట్టింది. ఇక ఈమె తాజాగా ఫిల్మ్‌చాంబర్‌ ఎదుట అర్ధనగ్నంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీని గురించి ఆమె మాట్లాడుతూ, సినిమాలలోఅవకాశాలు రాకపోతే బుల్లితెర, యూట్యూబ్‌ వంటి వాటికి వెళ్లవచ్చు కదా...! అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రతి చోటా ఇదే లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. వైవాహర్షా నాతో చేసిన అసభ్య చాట్‌ని చూడండి. మరి నేను ఎక్కడికి వెళ్లాలి? ఈ అర్దనగ్న నిరసన తర్వాత కెరీర్‌గా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేను. నా శరీరాన్ని మాత్రం అవమానించకండి.. ఇక నాకు నటించాలని కూడా లేదు. అవకాశాలు వస్తే నటిస్తాను.లేదంటే కామ్‌గాఉంటాను. నాకు అవకాశాలు రావు... నాకు నటించే ఆసక్తి కూడా లేదు. ఇలా జరగడం టాలీవుడ్‌కి బ్లాక్‌డేగా భావిస్తున్నారు. ఇది తెలుగు కళామతల్లికి అవమానం. 

చిన్నచిన్న నటులు కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇక అర్ధనగ్నప్రదర్శన తర్వాత పోలీసులు నన్ను నా ఇంటిలో దింపివెళ్లారు. మా ఓనర్‌ పిలిచి ఇల్లు ఖాళీ చేయమని చెప్పాడు. ఆయన పేరుకు ఐఏయస్‌. ఆయనెంత గొప్ప మనిషో చూడండి. మనసు లేని మనుషులు. ఎంత మొరటుగా మాట్లాడుతారో మీరు ఊహించను కూడా ఊహించలేరు. బడాబాబుల ఆట మొదలైంది. నేను నాకు అవకాశాలు రాకపోయినా ఫర్వాలేదు.. తెలుగమ్మాయిలకు మేలు జరగాలని ఈ ఉద్యమం చేస్తున్నాను. తెలుగు అమ్మాయిలు ఇకనైనా మేల్కోండి. తమిళనాడు జల్లికట్టు తరహాలో తెలుగులో హీరోయిన్లకు, నటీమణులకు జరుగుతున్న అన్యాయాలపై మాత్రం నాపోరాటం ఆగదు.. అని ప్రకటించింది. మరోవైపు ఆ అమ్మాయి అలా అర్ధనగ్నంగా కూర్చుంది అంటే ఆమె ఫస్ట్రేషన్‌లోఉందా? మానసికంగా బాగుందా? లేదా పబ్లిసిటీ చేస్తోందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఫిల్మ్‌ చాంబర్‌లోఎన్నో వేడుకలు, మరణాలు, ఇతర గొప్ప కార్యక్రమాలు సాగాయి. ఇక దీనిని ప్రస్తుతం కడిగి ప్రక్షాళన చేయాలి. మీడియాలో సినిమా కూడా ఒక భాగం. నిరసన తెలిపేందుకు కూడా భారతీయ సంప్రదాయాలు ఉన్నాయి. కానీ ఇలాంటి వారిని మాత్రం అసలు ప్రోత్సహించవద్దని సీనియర్‌ నటుడు నరేష్‌ పేర్కొన్నాడు. 

Sri Reddy Fires on Top Celebrities and Political Leaders:

Sri Reddy Allegations Sensation in Tollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ