ఇటీవల అనుష్కశర్మ,విరాట్‌కోహ్లిలు లేదు లేదంటూనే ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఇక నాగచైతన్య-సమంతలు ప్రేమించుకున్న తర్వాత వారిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకారం తెలపడంతో వీరు కూడా గోవాలో పెళ్లి చేసుకున్నారు. తన స్నేహితురాలి పెళ్లి కోసం వెడ్డింగ్ దుస్తులు, నగలు కొంటూ షాపింగ్ చేస్తున్నానని, తన పెళ్లి కోసం కాదని అబద్దాలు చెప్పిన శ్రియా కూడా పెళ్లి చేసుకుంది. మరోవైపు ఇలియానా తన బోయ్‌ఫ్రెండ్‌తో, శృతిహాసన్‌తో పాటు నయనతార-విఘ్నేశ్‌శివన్, దీపికాపడుకోనే-రణవీర్‌సింగ్, అమీజాక్సన్‌లు కూడా పెళ్లిళ్లకు రెడీ అవుతున్నారు. ఇక తెలుగమ్మాయి అంజలి అయితే హీరో జైతో కలిసి ప్రత్యేక కాపురం కూడా పెట్టిందని వార్తలు వస్తున్నాయి.
కాగా తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కనుంది. పలు తమిళ, మలయాళ భాషల్లో నటించిన హీరోయిన్ గాయత్రి కృష్ణన్ ప్రేమ వివాహానికి సిద్దమైంది. గత వారమే ఆమెకి ఆమె ప్రేమించిన సినిమాటో గ్రాఫర్ జీవన్ రాజుల నిశ్చితార్ధం జరిగింది. వీరు ఎంతో కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇక నిశ్చితార్దం తర్వాత వచ్చే ఏడాది మొదట్లో వీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమది ప్రేమ వివాహమే అయినప్పటికీ ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారని, దాంతో తమది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్‌గా జరగనుందని గాయత్రి కృష్ణన్ చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత కూడా నేను నటిస్తాను. మేము సాధించాల్సిన విజయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి... అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈమె హీరోయిన్‌గా కోలీవుడ్‌లో వచ్చిన 'జోకర్' చిత్రంతో పరిచయమైంది. ఇక 'కాటన్‌మేరి' కూడా విడుదల కాగా, త్వరలో ఆమె నటించిన 'మేర్కు తొడర్చిమలై' విడుదలకు సిద్దమవుతోంది.