Advertisementt

దిల్ రాజు మీద కోపంతో జగడం సినిమా తీశాను!

Tue 10th Apr 2018 11:58 AM
sukumar,dil raju,jagadam movie  దిల్ రాజు మీద కోపంతో జగడం సినిమా తీశాను!
Sukumar Sensational comments on dil Raju దిల్ రాజు మీద కోపంతో జగడం సినిమా తీశాను!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ తో ఆర్య సినిమా తీసిన తర్వాత జగడం సినిమాని కూడా అల్లు అర్జున్ తోనే తీయాలనుకున్నానని కానీ నిర్మాత దిల్ రాజుతో సమస్య వచ్చి రాత్రికి రాత్రి రామ్ హీరో గా జగడం సినిమా ప్రకటించానని డైరెక్టర్ సుకుమార్ వ్యాఖ్యానించాడు. ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుకుమార్ తన మనసులో మాట చెప్పాడు.

జగడం సినిమాను అల్లు అర్జున్ తో కానీ..మహేష్ బాబుతో కానీ చేద్దాం అనుకున్నానని తమ్ముడు పాత్రలో రామ్ ని పెడదాం అనుకున్న కానీ కొన్ని కారణాలు వల్ల హీరోగా రామ్ ని పెట్టి.. అందుకే తమ్ముడు పాత్ర మరింత చిన్నగా మారిపోయిందని చెప్పాడు. సినిమా ఓపెనింగ్ కి అల్లు అర్జున్ తో పాటు దిల్ రాజుని ఇన్వైట్ చేశానని.. దిల్ రాజు వచ్చి, 'బుద్ధుందా? ఏమి చేస్తున్నావు నువ్వు?' అని అంటే, 'నాకు కోపం వచ్చింది' అని చెప్పానని, 'కోపం వస్తే సినిమా మొదలు పెడతావా?' అని చీవాట్లు పెట్టారని చెప్పుకొచ్చాడు.

జగడం ప్లాప్ తో తానూ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలిసొచ్చింది అని అన్నారు. మహేష్ బాబుతో '1 నేనొక్కడినే' చిత్రం సూపర్ హిట్ అవుతుందని భావించానని కానీ పల్లెటూరు వారికి నచ్చిద్దో నచ్చదో అని ఆలోచించకుండా తీశానని అందుకే ఆ సినిమా ప్లాప్ అయింది అని చెప్పాడు సుకుమార్.

Sukumar Sensational comments on dil Raju:

Sukumar Serious on Dil Raju About Jagadam movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ