Advertisementt

వర్మ.. శ్రీరెడ్డిని కూడా వదలలేదు..!

Tue 10th Apr 2018 11:44 AM
ram gopal varma,sri reddy,pawan kalyan,social media  వర్మ.. శ్రీరెడ్డిని కూడా వదలలేదు..!
Ram Gopal Varma Tweets on Sri Reddy వర్మ.. శ్రీరెడ్డిని కూడా వదలలేదు..!
Advertisement
Ads by CJ

సాధారణంగా మీడియాలో, సోషల్‌ మీడియాలో కూడా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ తనదైన శైలిని చాటుకుంటూ ఉంటాడు. ఏ వివాదం అయినా ఆయన దృష్టికి వచ్చిందంటే ఆ అవకాశాన్ని వదులుకోడు. ఏ వివాదాలు లేనప్పుడు తానే వివాదాన్ని రాజేస్తాడు. ఇప్పుడు ఆయన తరహాలోనే పలువురు నటీమణులు లేడీ వర్మలుగా మారుతున్నారు. రాధికా ఆప్టే, మధులత, శ్రీరెడ్డి వంటి వారికి బహుశా వర్మ, కత్తి మహేష్‌ వంటి వారే ఆదర్శమేమో అనిపిస్తోంది. ఇక తాజాగా శ్రీరెడ్డి తనకు 'మా' సభ్యత్వం ఇవ్వనందుకు బట్టలూడదీసుకుని ఫిల్మ్‌చాంబర్‌ వద్ద ధర్నా చేయడం సంచలనంగా మారింది. ఎంతగా మీడియా హైలైట్‌ చేయకూడదని భావించినా విషయాన్ని పోటీ పడి వార్తలు అందించాల్సిన స్థితిలో మీడియా ఉంది. ఇక సోషల్‌ మీడియా, వెబ్‌ చానెల్స్‌, టివి చానెల్స్‌ ద్వారా సంచనల వ్యాఖ్యలు చేస్తున్న శ్రీరెడ్డి గురించి రాంగోపాల్‌ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ముంబైలోని చాలా మందికి పవన్‌కళ్యాణ్‌ తెలియకపోవచ్చు గానీ శ్రీరెడ్డి గురించి మాత్రం వారికన్నీ తెలుస్తున్నాయని, పవన్‌ కంటే నేడు శ్రీరెడ్డి జాతీయ సెలబ్రిటీగా మారింది. అంటూ ట్వీట్‌ చేశాడు. 

ఇక శ్రీరెడ్డి విషయంలో స్పందించమని ఏ సినీ ప్రముఖుడిని అడిగినా మాట్లాడకుండా తప్పించుకుపోతున్న తరుణంలో వర్మ అదే పనిగా ట్వీట్‌ చేయడం విశేషం. ఇక తాజాగా టాలీవుడ్‌ పరువును మంటగలిపిన శ్రీరెడ్డిపై 'మా' అసోసియేష్‌ కఠిన చర్యలు తీసుకుంది. 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, అనవసర ఆరోపణలు, అర్థనగ్నంగా ధర్నా చేసినందుకు గాను ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీరెడ్డికి 'మా' సభ్యత్వం ఇచ్చే ప్రశ్నే లేదని తెలిపారు. ఎందరో 'మా' అసోసియేషన్‌లో మెంబర్‌షిప్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారని, కేవలం ఇలా అర్థనగ్నంగా కనిపిస్తేనే మా సభ్యత్వం వస్తుందని శ్రీరెడ్డి భావించవద్దని ఆయన తేల్చిచెప్పాడు. మరోవైపు ఆమెతో మా అసోసియేషన్‌లో సభ్యులైన ఎవ్వరూ కలిసి నటించరని, ఆలా నటిస్తే వారిని కూడా బ్యాన్‌ చేస్తామని శివాజీరాజా చెప్పడంతో శ్రీరెడ్డికి వచ్చిన తేజ చిత్రాలలోని రెండు ఆఫర్స్‌, రామకృష్ణ గౌడ్‌తో పాటు 'మా బంగారు తల్లి' రాజేష్‌ టచ్‌ లీవర్‌ కూడా ఆమెని పెట్టుకుంటారో లేదా శివాజీ రాజా, మా అసోసియేషన్‌కి మద్దతు ఇస్తారో వేచిచూడాల్సివుంది...! 

Ram Gopal Varma Tweets on Sri Reddy:

Sri Reddy has Become National Celebrity: RGV

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ