Advertisementt

సైరా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే..?

Tue 10th Apr 2018 11:39 AM
chiranjeevi,sye raa movie,aluminium factory,updates  సైరా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే..?
Sye Raa Narsimha Reddy Latest Update సైరా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే..?
Advertisement
Ads by CJ

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. చిరంజీవి 151వ చిత్రం వస్తున్నా ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయ్. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చిరంజీవి కొడుకు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మెగా స్టార్ చిరంజీవి. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కోయిలకుంట్ల ట్రెజరీ సెట్ ను రూపొందించారు. కర్నూల్ లోని కోయిలకుంట్ల ప్రాంతంలో ఉన్న ట్రెజరీని కొల్లగొట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిషు వారిపై తన తిరుగుబాటును ప్రారంభించారు.

ఆ ముఖ్యమైన చారిత్రిక ఘట్టం కోసమే ఈ సెట్ ను డైరెక్టర్ సురేంద్ర రెడ్డితో పాటు చిత్ర యూనిట్ రూపొందించారు. ఇక ఈ చిత్ర షూటింగ్ లో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్, లేడీ సూపర్ స్టార్ నయనతారలు కూడా పాల్గొంటున్నారు.

Sye Raa Narsimha Reddy Latest Update:

Chiranjeevi Busy at Aluminium factory for Sye Raa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ