గత కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్‌పై పలువురు హీరోయిన్లు పెదవి విప్పుతున్నారు. కానీ శ్రీరెడ్డి అనే నటి మాత్రం సంచలనంగా మారింది. ఇలా ఇష్ట మొచ్చినట్లు ప్రవర్తిస్తే మీడియా అటెన్షన్‌ని సాధించగలమని, ప్రజల్లో గుర్తింపు వస్తుందని, తనకు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంటే దానిని ఎందుకు వదులుకోవాలని? శ్రీరెడ్డి ప్రశ్నిస్తోంది. ఇక ఈమె తాజాగా ఫిల్మ్‌చాంబర్ ఎదుట టాప్‌లెస్‌గా, అర్ధనగ్నంగా నిరసన తెలిపింది. దీంతో శ్రీరెడ్డి ఉదంతం ఇప్పుడు జాతీయ స్థాయిలో టాలీవుడ్ పరువును గంగ పాలు చేసినట్లయింది. ఇక శ్రీరెడ్డి విషయంలో కఠినంగా వ్యవహరించాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇందులో 'మా'లో కీలక సభ్యురాలైన హేమ మాట్లాడుతూ, నిరసన తెలపాలంటే మౌనపోరాటం వంటి మార్గాలెన్నో ఉన్నాయని, కానీ ఆమె అర్ధనగ్నంగా బట్టలిప్పదీసుకుని కూర్చోవడం సరికాదని అభిప్రాయ పడింది. సినిమా అవకాశాలు రావడం అనేది ఎవరి చేతిలో ఉండదని, అది హిట్, ఫ్లాప్‌ల మీద ఆధారపడి ఉంటుందని, గత కొంత కాలంగా తనకు కూడా వేషాలు రావడం లేదని తెలిపింది. నేను 300 వరకు సినిమాలలో నటించాను. తెలుగువారిని పెట్టుకోరు అనడం తప్పు, నేను కూడా తెలుగమ్మాయినే. ఇన్నిరోజుల నుంచి శ్రీరెడ్డి ఆందోళన చేస్తున్నా తాను ఆమె విషయం మాట్లాడక పోవడానికి ఆమె వ్యవహరిస్తున్న తీరే కారణమని తెలిపింది.
ఇక 'మా' సభ్యత్వం కోసం కొన్ని రూల్స్ ఉన్నాయని, ఆమెకి 'మా' మెంబర్‌షిప్ అప్లికేషన్ కూడా ఇచ్చామని, కానీ ఆమె దానిని సరిగా పూర్తి చేయలేదు. కట్టాల్సిన డీడీ, ఫొటోలు కూడా అంటించకుండా అప్లికేషన్‌ని ఇస్తే ఎలా? ఇప్పటికే చాలా మంది 'మా' అసోసియేషన్‌లో సభ్యత్వం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి కాకుండా ముందుగా శ్రీరెడ్డికి మా సభ్యత్వం ఎలా ఇస్తాం? ఇక అప్లికేషన్‌లో ఆమెను రికమండ్ చేస్తూ ఇద్దరు సంతాకాలు పెట్టాలి. కానీ ఆమె అప్లికేషన్‌లో ఒక్క సంతం కూడా పెట్టించలేకపోయింది. నేను ఎంతోకాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నా. నేను ఆమెని ఎప్పుడు చూడలేదు... ఆమె టాలీవుడ్‌కి ఏం సేవ చేసిందని చెప్పి ఆమెకి ఫ్రీగా మెంబర్‌షిప్ ఇవ్వాలి? ఆమెని ఇలా చేస్తే అక్క, చెల్లి, వదిన వంటి పాత్రలలోఆమెని ఊహించుకోగలమా? అని హేమ ప్రశ్నించింది. ఇందులో హేమ వాదన బాగా ఉంది. దాంతో పాటు శ్రీరెడ్డిది ఓవర్‌యాక్షన్ అని అర్ధమవుతోంది.