ప్రస్తుతం మూడు భాషలైన తెలుగు, తమిళ, మలయాళీ సినీ ప్రియులు ఎదురుచూస్తున్న చిత్రం సావిత్రి బయోపిక్‌గా రూపొందుతున్న 'మహానటి' చిత్రం.'రంగస్థలం' వంటి పీరియాడికల్ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన వేళ మహానటి సావిత్రి జీవితానికి తెర రూపు ఇవ్వనుండటంతో సినీ అభిమానులు, నాటి సావిత్రి ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈచిత్రం మే9వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. మరి ఈ చిత్రం నాటికైనా తమిళనాట థియేటర్ల బంద్ ఆగుతుందో లేదో చూడాలి. ఇక సావిత్రి బయోపిక్‌గా రూపొందుతున్న చిత్రంలో కీర్తిసురేష్, సమంత, షాలినిపాండే, విజయ్‌దేవరకొండ, ప్రకాష్‌రాజ్, దుల్కర్ సల్మాన్ వంటి మహామహులు నటిస్తున్నారు. వీరితో పాటు ప్రకాష్‌రాజ్, నాగచైతన్య, సాయిమాధవ్ బుర్రా, 'పెళ్లిచూపులు' దర్శకుడు తరుణ్‌భాస్కర్ వంటి హేమా హేమీలు నటిస్తుండగా,ఈ మధ్య ఎలాంటి సక్సెస్‌లేని అశ్వనీదత్ తన వైజయంతి పతాకంపై నిర్మిస్తుండగా, ఆయన అల్లుడు, 'ఎవడే సుబ్రహ్మణ్యం'ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక ఈచిత్రంలో మోహన్‌బాబు ఎస్వీరంగారావు పాత్రను చేస్తున్నాడు. ఇక 'మాయాబజార్'లోని ఘటోత్కచుని పాత్ర అయిన ఎస్వీరంగారావుపై వచ్చే 'వివాహ భోజనంబు' పాటని మోహన్‌బాబుపై చిత్రీకరించారని, ఇది ఈ చిత్రానికి హైలైట్ కానుందని అంటున్నారు. ఇక ఈచిత్రం కోసం మోహన్‌బాబు షూటింగ్ చేసింది కేవలం రెండు రోజులేనని, దీనికి గాను ఆయనకు 75లక్షల పారితోషికం లభించిందని వార్తలు వస్తుంటే మరో ఆసక్తికర విషయం ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఎస్వీరంగారావు పాత్రని చేయడమే తన అదృష్టమని, ఈ చిత్రం కోసం అశ్వనీదత్ ఏకంగా కోటి రూపాయల పారితోషికం ఇవ్వబోయినా మోహన్‌బాబు నో చెప్పాడని, తన ఖర్చు కూడా తానే భరించుకుంటూ ఆయనీ పాత్రని ఉచితంగా చేశాడని కొందరు మోహన్‌బాబుని ఆకాశానికి ఎత్తుతున్నారు. మరి అదే నిజమైతే నిజంగా మోహన్‌బాబుని ఎంత పొగిడినా తక్కువే అని చెప్పాలి.