ఎవరు ఎన్ని చెప్పినా, తమ చిత్రాలకు, ఎన్నికలకు సంబంధమే లేదని వ్యాఖ్యానించినా కూడా బాలయ్య తీస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్, మమ్ముట్టి హీరోగా రూపొందనున్న 'యాత్ర' చిత్రం కూడా ఎన్నికల వేడిలో ఆయా పార్టీలైన టిడిపి, వైసీపీలకు మేలు చేసేందుకు రూపొందుతున్నవేనని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్ పాత్రను ఆయన కుమారుడైన బాలకృష్ణనే పోషిస్తుండగా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతున్న'యాత్ర' మూవీలో దిగ్గజ నటుడు మమ్ముట్టి నటించనున్నాడు. ఇక బాలయ్యాస్ 'ఎన్టీఆర్' బయోపిక్‌కి తేజ దర్శకత్వం వహిస్తుండగా, వైఎస్ బయోపిక్ అయిన 'యాత్ర'కు 'ఆనందో బ్రహ్మ' దర్శకుడు మహిరాఘవ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ చిత్రంలో వైఎస్ పాత్రకు ఎవరో వినోద్‌కుమార్ వంటి ఫేడవుట్ అయిన ఆర్టిస్టులను ఎంచుకోకుండా ఏకంగా దేశం గర్వించదగ్గ నటుడు మమ్ముట్టి చేయనుండటంతో ఈ చిత్రంపై కూడా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
ఇక ఈచిత్రం టైటిల్‌లోగో 'యాత్ర'ని విడుదల చేసినప్పుడు టైటిల్ లోగోకి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇక తాజాగా ఈచిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మార్క్ పంచె కట్టుతో, ఆయన లాగే అభివాదం చేస్తూ ఉండటం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి మెయిన్ అట్రాక్షన్ మమ్ముట్టినే అవుతాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఈ రెండు బయోపిక్‌లలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే వరకు చూపిస్తారని అంటుండగా, వైఎస్ 'యాత్ర' చిత్రంలో మెయిన్‌గా ఆయన పాద యాత్రను హైలైట్ చేయనున్నారని అర్ధమవుతోంది. ఇక ఈ 'యాత్ర' చిత్రానికి క్యాప్షన్‌గా 'కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను..మీతో కలిసి నడవాలని ఉంది. మీగుండె చప్పుడు వినాలని ఉంది' అని పెట్టారు. మరి ఈ ఇద్దరు విరుద్దమైన దిగ్గజాల బయోపిక్‌లలో ఎవరి బయోపిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది..!