1998 అక్టోబర్‌లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ రాజస్థాన్‌లోని అడవుల్లో జరుగుతుండగా, షూటింగ్‌ని ముగించుకుని వస్తున్న సల్మాన్‌ఖాన్, సైఫ్ అలీఖాన్, సోనాలి బింద్రే, టబు, నీలమ్‌లు వెనుక సీటులో ఉండి సల్మాన్‌ని కృష్ణజింకను కాల్చమని ప్రోత్సహించారని తాజాగా జోధ్‌పూర్ కోర్టులో ప్రాసిక్యూషన్ ఆరోపించింది. సల్మాన్‌కి జైలు శిక్ష పడటం ఖాయమని ఊహించిన వారు ప్రత్యక్ష సాక్షి పూనమ్ బిష్ణోయ్ సాక్ష్యం ప్రకారం సల్మాన్‌తో పాటు వీరందరికీ కూడా శిక్ష తప్పదని ఊహించారు. ఇక ప్రాసిక్యూషన్ కూడా సల్మాన్‌తో పాటు టబు, సోనాలిబింద్రే, సైఫ్‌అలీఖాన్, నీలమ్‌లకి కూడా శిక్ష ఖాయమని భావించింది. కానీ కోర్టుకి వచ్చిన ప్రత్యక్ష సాక్షి మాత్రం నాడు కృష్ణజింకను చంపింది సల్మాన్‌ఖానే అని గట్టిగా చెప్పినప్పటికీ వెనుక వైపు నుంచి ప్రోత్సహించిన వారిని గుర్తు పట్టలేక పోవడంతో గట్టిగా వారిని నిర్ధారించలేక పోయాడు. దాంతో వీరిపై సాక్ష్యం బలంగా లేనందువల్ల వీరు తృటిలో శిక్ష నుంచి తప్పించుకున్నారు. లేకపోతే సల్మాన్‌కి తోడుగా వీరు కూడా జైలులో శిక్ష అనుభవించడం ఖాయమయ్యేది. ఇక సల్మాన్‌కి శిక్షపడకూడదని, తీర్పు వచ్చే ముందు కత్రినా కైఫ్ ముంబైలోని సుప్రసిద్ద వరసిద్ది వినాయక స్వామి గుడిలో పూజలు కూడా నిర్వహించింది. ఇక సల్మాన్ ఎన్నో మంచి పనులు చేస్తున్నాడని, సామాజిక సేవా దృక్పథం ఎక్కువగా ఉన్న సల్మాన్‌కి అంతటి కఠినమైన శిక్ష విధించడం సరికాదని జయాబచ్చన్ తెలిపింది.
ఇక కపిల్‌శర్మ మరో అడుగు ముందుకేశాడు. గతంలో తాము సింహాలను, పులులను వేటాడి చంపామని చెప్పే పలువురు బడాబాబులను చూశానని, సల్మాన్ ఎంతో మంచివాడని, ఆయనకు ఇంత కఠిన శిక్ష విధించిన ఈ వ్యవస్థ ఎంతో చెత్తదని వ్యాఖ్యానించాడు. ఇక మీడియాను ఆయన దుయ్యబడుతూ, మీ పత్రికల, చానెల్స్ సర్క్యులేషన్, టీఆర్పీల కోసం మీ ఇష్టం వచ్చినట్లు నెగెటివ్ వార్తలు రాయకండి. సల్మాన్ మంచి మనిషి, ఆయన తప్పు చేశాడో లేదో నాకు తెలియదు. కానీ ఆయనలోని మంచి కోణాన్ని చూడండి...మీడియా పెద్ద ఘోరాలు జరిగినా మాట్లాడదు. కానీ నెగెటివ్ వార్తలను బాగా ప్రచారం చేస్తారు. చెత్త వ్యవస్థ, చెత్త మనుషులు అని వ్యాఖ్యానించాడు. ఇక మీడియా అనేది ప్రతిపక్షంగా మాత్రమే వ్యవహరించాలని అందరు ఒప్పుకుంటారు. మరి అదే పని చేస్తే మాత్రం ఇలాంటి చెత్త వ్యవస్థ, చెత్త మనుషులు అని వ్యాఖ్యానించడం గర్హనీయం. ఇక ఈయనే ప్రధాన మంత్రి అయితే నెగెటివ్ వార్తలు రాసేవారిని ఉరివేస్తానని ప్రకటించాడు. ఇప్పటికే హిట్ అండ్ రన్, డ్రంక్ అండ్ డ్రైవ్ లో సల్మాన్ చాకచక్యంగా బయటికి వచ్చాడు. తన ఆర్ధిక, అంగ, రాజకీయ బలాలతో ఆయన ఈ పని చేయగలిగాడు. ఇలాంటి సందర్భంలో ఎంత గొప్పవారైనా చట్టం ముందు సమానమేనని నిరూపించిన జోధ్‌పూర్ కోర్టుకి, న్యాయ మూర్తులకి కృతజ్ఞతలు తెలుపకుండా చెత్త వ్యవస్థ అని విమర్శించే వారే నిజమైన చెత్త మనుషులు అని చెప్పాలి...!