Advertisementt

నాన్‌ బాహుబలి రికార్డ్స్ అన్నీ సిట్టిబాబువే!

Sun 08th Apr 2018 08:42 PM
ram charan,rangasthalam,chittibabu,non baahubali  నాన్‌ బాహుబలి రికార్డ్స్ అన్నీ సిట్టిబాబువే!
Rangasthalam Chittibabu Eye on Non Baahubali Records నాన్‌ బాహుబలి రికార్డ్స్ అన్నీ సిట్టిబాబువే!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - సుకుమార్ రంగస్థలం రచ్చ మాములుగా లేదు. గతవారం విడుదలైన రంగస్థలం ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్లకు పైగా షేర్ సాధించి లోకల్ గా తానేమిటో చరణ్ ప్రూవ్ చేసుకున్నాడు. ఎనిమిదో రోజు, తొమ్మిదో రోజు కూడా థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనబడ్డాయి అంటేనే 'రంగస్థలం' సినిమా క్రేజ్ ఏమిటో అర్ధమవుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగిన రంగస్థలం సినిమా అటు క్లాస్ ఆడియన్స్ ని ఇటు మాస్ ఆడియన్స్ ని ఓవరాల్ గా పడగొట్టేసింది. చిన్న పెద్ద ఎవరి నోట విన్న రంగస్థలం సినిమా హిట్ గురించిన ముచ్చట్లే. చిట్టిబాబుగా రామ్ చరణ్ విశ్వరూపం చూపించాడు. కెరీర్ లో బెస్ట్ పెరఫార్మెన్స్ తో చరణ్ తో పాటు హీరోయిన్ సమంత రామలక్ష్మి పాత్రని పండించింది.

కేవలం రామ్ చరణ్ హవా రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఓవర్సీస్ నుండి ఇతర ప్రాంతాలలోను రంగస్థలం తన హవా కొనసాగిస్తోంది. ఇక ఈ వారం రోజుల్లో కూడా రంగస్థలం కలెక్షన్స్ అదరగొడతాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే నితిన్ 'ఛల్ మోహన్ రంగ' గత గురువారం విడుదలై పెద్దగా మ్యాజిక్ చెయ్యలేకపోయింది. అలా ఛల్ మోహన్ రంగ నెగెటివ్ టాక్ రంగస్థలంకి గట్టిగా తగులుకుంది. ఇప్పటికి మల్టీప్లెక్సుల్లో రంగస్థలం బొమ్మకి బాగా గిరాకీ ఉందంటే రంగస్థలం ఎంత పెద్ద హిట్టో అర్ధమవుతోంది. ఈ వారాంతానికి రంగస్థలం కలెక్షన్స్ తొంభై నుంచి తొంభై అయిదు కోట్ల వరకు కొల్లగొడుతుందని అంచనా. ఇక రెండవ వారం ముగిసేలోగా వంద కోట్ల షేర్‌ దాటుతుందని కూడా ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రంగస్థలం ఫుల్ రన్ లో ఖైదీ నంబర్‌ 150 రికార్డుని క్రాస్ చేసి నాన్‌ బాహుబలి రికార్డు నెలకొల్పడం ఖాయమంటున్నారు. మరి ఏ ఏడాది విడుదలైన పెద్ద సినిమాల్లో రంగస్థలం మాత్రమే ఇలా భారీ మొత్తంలో వసూలు చెయ్యడం మాత్రం రామ్ చరణ్ కే సాధ్యమైంది.

Rangasthalam Chittibabu Eye on Non Baahubali Records:

Rangasthalm Resound Starts..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ