కోలీవుడ్‌లో రజనీ, అజిత్, ధనుష్, శింబు వంటి వారి సినిమాల విషయంలో ఓ సారూప్యత ఉంది. తాము పనిచేసిన షూటింగ్ పూర్తవ్వగానే లైట్‌బోయ్ నుంచి అందరినీ ఆహ్వానించి మంచి భోజనం పెట్టి, కానుకలు ఇచ్చే అలవాటు, సంస్కారం వారిది. కానీ తెలుగులో మాత్రం ఇది ఎప్పుడో గానీ కనిపించదు. ఏదైనా పార్టీ ఇచ్చిన కూడా అందులో ముఖ్యులకే చోటు ఉంటుంది గానీ అందరితో సమానంగా కష్టపడే జూనియర్ ఆర్టిస్టుల, లైట్ బోయ్‌కు స్థానం ఉండదు. ఇక సినిమా పూర్తయిన తర్వాత కాకుండా సినిమా విడుదలై హిట్ అయితేనే హీరోలు, నిర్మాతలు, దర్శకులకు గిఫ్ట్‌లు వంటివి ఇస్తూ ఉంటారు. ఇక ఈ విషయంలో అనసూయ కాస్త బెటర్‌గానే రియాక్ట్ అయిందని అనిపిస్తోంది. సుకుమార్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' చిత్రం వారం పూర్తయ్యే సరికి అన్ని నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసి లాభాల బాట పట్టింది. ఇప్పటికే అసలు వసూలు కాగా, ఇక నుంచి వచ్చేవన్నీ లాభాలే.
ఇక ఈ చిత్రం జబర్ధస్త్ మహేష్, రంగమ్మత్తగా నటించిన అనసూయకి మంచి పేరు తెచ్చింది. ఇక ఇంతకాలం తర్వాత తనలోని టాలెంట్‌ని పూర్తిగా బయటికి తెచ్చిన రామ్‌చరణ్, మాస్‌ని కూడా ఆకట్టుకునే సినిమా తీసినందుకు సుకుమార్‌కి, గ్లామర్ పాత్రలే కాదు. డీ గ్లామరైజ్‌డ్ పాత్రలని కూడా చేసి మెప్పించగలనని సమంత వంటి వారు నిరూపించుకోవడం విశేషం. తాజాగా ఇందులో రంగమ్మత్తగా చేసిన అనసూయ 'రంగస్థలం'లోని మెయిన్ యూనిట్‌ని పిలిచి విందు భోజనం ఇచ్చింది. ఈ విందు ఎంతో అద్భుతంగా ఉందంటూ 'రంగస్థలం' చిత్రానికి అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన గౌరీ నాయుడు ఓ ట్వీట్ చేసింది. 'రంగమ్మత్త విందు భోజనం చాలా బాగుంది. మా రంగస్థలం గ్రామస్థులు, మా ప్రెసిడెంట్ సన్నిహితులు' అంటూ ఓ ఫోటోని కూడా పోస్ట్ చేసింది. దానికి రంగమ్మత్త అనసూయ స్పందిస్తూ, 'హాహాహా....సచ్ లవ్లీ టైం' అని మురిసిపోయింది. ఇక తెలుగులో కొత్త సంప్రదాయానికి, దర్శక నిర్మాతలతో పాటు అందరితో కలసి రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేయడం ఎలాగో అనసూయని చూసి మిగిలిన వారు నేర్చుకోవాలి.. ఏమంటావు అనసూయ ఆంటీ...!