మహేష్ బాబు అర్జున్ రెడ్డి సినిమాని చూసి విజయ్ దేవరకొండ దగ్గర నుండి, దర్శకుడు సందీప్ వంగ, హీరోయిన్ షాలిని పాండేలకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియ జేశాడు. అంత పెద్ద స్టార్ హీరో ఇలా ఒక సినిమాపై స్పందించడం అనేది చాలా ఆసక్తికర పరిణామమే. అయితే తాజాగా మహేష్ బాబు మరో మూవీని అందులో నటించిన నటీనటులను తెగ పొగిడేశాడు. రామ్ చరణ్ హీరోగా సుక్కు దర్శకత్వంలో గత శుక్రవారం విడుదలై బాక్సాఫీసు దుమ్ముదులుపుతున్న రంగస్థలం సినిమా చూసిన ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు చిట్టిబాబు నటనను, రామలక్ష్మిలా సమంత నటనను, ఇంకా అందులోని నటీనటులను, దర్శకుడు సుకుమార్ ని, టెక్నీకల్ టీమ్ ని పొగిడిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నుండి రానా వరకు అందరూ రంగస్థలంపై పొగడ్తల వర్షం కురిపించారు.
తాజాగా ఆ లిస్ట్ లోకి సూపర్ స్టార్ మహేష్ కూడా జాయిన్ అయ్యాడు. వారం తర్వాత రంగస్థలం చూసిన మహేష్ బాబు అందులో నటించిన రామ్ చరణ్ దగ్గర నుండి అనసూయ వరకు అందరిని పేరు పేరున తన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశాడు. తన ట్విట్టర్ లో మహేష్.... రంగస్థలం మూవీ రా.. రస్టిక్ అండ్ ఇంటెన్స్ గా ఉంది. సుకుమార్ నిజంగా మాస్టర్ ఆఫ్ ది ఆర్ట్. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ రాక్ స్టార్ గా తన సత్తా చాటుకున్నాడు. రత్నవేలు వర్క్ ఎప్పటిలా చాలా బ్రిలియంట్ గా ఉంది. మైత్రీ మూవీస్ టీం మరో ఘన విజయం సాధించారు... అంటూ అదిరిపోయే కాంప్లిమెంట్స్ రంగస్థలం టీమ్ కి ఇచ్చేశాడు.
అంతేకాకుండా అందరూ చిట్టిబాబుగా రామ్ చరణ్ నటనను, రామలక్ష్మిలా సమంత నటనను పొగిడేసినట్టే మహేష్ బాబు కూడా... రామ్ చరణ్ అండ్ సమంతలకు ఇదే కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ఖచ్చితంగా చెప్పగలను. టీం మొత్తానికి కంగ్రాచ్యులేషన్స్. సినిమా చూస్తూ నేను బాగా ఎంజాయ్ చేశాను అంటూ ట్వీట్ చేశాడు. మరి చరణ్, మహేష్ ఫ్రెండ్స్. అలాగే సుక్కూ డైరెక్షన్ లో మహేష్ సినిమా చేసున్నాడు. అంతే కాకుండా సమంతతో కలిసి చాలా సినిమాలో నటించాడు. అయినా ఊరికే టీమ్ కి శుభాకాంక్షలు చెప్పకుండా... సినిమా చూసొచ్చి ఇలా అభినందనలు చెప్పడం మాత్రం కేక.. అంటున్నారు.