పెద్ద స్టార్స్ సినిమా అంటే రూమర్స్ రావడం మాములే. బాహుబలి మొదటి పార్ట్ అప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియక చాలా మంది రకరకాల వార్తల్ని నమ్మి మోసపోయారు. మళ్లీ ఇప్పుడు అలానే రాజమౌళి మల్టీ స్టార్రర్ విషయంలో జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా రూమర్స్ బయటికి వస్తున్నాయి.
పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోనే కాకుండా సాధారణ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు చాలా పెరిగిపోయాయి. అంతే కాకుండా సినిమా బడ్జెట్ 250 కోట్లు ఎందుకు అని తెలుసుకోవాలని ఉంటది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద తాజాగా ఓ రూమర్ హల చల్ చేస్తుంది. కథ పరంగా సినిమా కాలాన్ని బేస్ చేసుకొని ఉంటుందని చెబుతున్నారు.
పూర్వకాలం - ప్రస్తుత కాలం జరిగే కథ అని.. మరోపక్క ఇండిపెండెన్స్ టైమ్ నుంచి 2020 సమయం వరకు జరిగే కథ అని ఇలా టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక విదేశీ నటీనటులు కూడా ఉంటారని మరో సమాచారం. 2020 సమ్మర్ ఈ సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడంట రాజమౌళి. మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో చూడాలి.