ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sofia Hayat Shocking Comments On Salman Khan

భేష్‌..సల్మాన్‌ని కడిగేసింది..!

Sofia Hayat Shocking Comments On Salman Khan

ఆయనో ప్లేబోయ్‌గా బిహేవ్‌ చేస్తాడు. కానీ ఆయన భారతదేశానికి, అందులోనూ యూత్‌ని ఐకాన్‌ వంటి వాడు. చేసేవన్నీ చెత్త పనులే కావడంతో ఆ దుష్ట్రభావం యూత్‌ని కూడా తాకుతోంది. ఆయన తరహాలోనే నేటి కోట్లాది మంది యువత నడిచే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి సల్మాన్‌ఖాన్‌ వల్ల యువత పొడదోవన పడుతున్నా కూడా ఆయనకు శిక్షపడినంతనే బాలీవుడ్‌ షాక్‌ అయింది. దానికి కారణం కేవలం ఆయన బాలీవుడ్‌ని కనుసైగలతో నియంత్రించే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించే స్టార్‌ కావడమే. దాంతో ఈ విషయంపై బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్‌ సోఫియా హయత్‌ ధైర్యంగా తన అభిప్రాయాన్ని తెలిపి, సల్మాన్‌కి శిక్ష పడటం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ, నీవు చేసిన ఖర్మలే నీకు ముగింపు పలికాయి. సల్మాన్‌కి వ్యతిరేకంగా మాట్లాడేందుకు అందరు భయపడతారు. కారణం బాలీవుడ్‌ని కంట్రోల్‌ చేసే శక్తి ఆయనకి ఉంది. చేసిన తప్పుకు సల్మాన్‌ జైలుకి వెళ్లడం ఆనందంగా ఉంది. ఈ భూమి మీద వన్యప్రాణులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాటిని కొందరు దేవుళ్లుగా కొలుస్తారు. వాటిని చంపడంతో పాటు ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆయన ప్రవర్తించిన తీరు చాలా దారుణం. 

అది ఆయన స్వార్ధపూరిత మనసుని తెలుపుతుంది. దేశ యువతకు సల్మాన్‌ రోల్‌ మోడల్‌ వంటి వాడు. ఆయన తప్పు చేయకూడదు. ఇలాంటి పనుల ద్వారా సల్మాన్‌ సమాజానికి, తన అభిమానులకు, యూత్‌కి ఏమని సందేశం ఇస్తున్నాడు? సెలబ్రిటీ అయినంత మాత్రాన వన్యప్రాణులను చంపి, తప్పించుకునే ప్రయత్నం చేస్తాడా? డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో కూడా ఆయన మనుషులు, అమాయకుల ప్రాణాలను హరించాడు. వేరే దేశాలలో అయితే సల్మాన్‌ తప్పించుకునే వాడా? ఇన్ని తప్పులు చేసిన తర్వాత ఆయన సమాజ సేవకునిగా అవతారం ఎత్తి ప్రజల ముందుకు వచ్చాడు. ఆ అవతారం ఇప్పుడు శిక్షతో బయట పడింది. నువ్వు ఎంత గొప్పవాడివైనా.. చట్టం ముందు నీవు చిన్న వాడివే అనే విషయం సల్మాన్‌కి అర్ధమై ఉంటుందని ఆమె తెలిపింది. ఈమె సల్మాన్‌ విషయంలో చెప్పిన ప్రతిమాటా అక్షరసత్యమనే చెప్పాలి...! 

I am happy Salman is in Jail: Sofia Hayat

sofia hayat
salman khan
blackbuck case
jail