త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ తెగ కష్టపడుతున్నాడు. జై లవ కుశ లో కాస్త లావుగా కనబడిన ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో సినిమా కోసం మాత్రం బాగా సన్నబడడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే 20 కిలోలు తగ్గిన ఎన్టీఆర్ సన్నబడిన లుక్ మాత్రం ఐపీఎల్ యాడ్ లో స్పష్టంగానే కనబడుతుంది. అయితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం కొత్తగా మేకోవర్ అవుతున్నాడు. మొదట్లో ఎన్టీఆర్ సన్నబడడానికి లైపో ని ఆశ్రయించాడనే టాక్ వినబడినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం జిమ్ లోనే కష్టపడి వెయిట్ లాస్ అయ్యాడని అన్నారు. ఇకపోతే ఎన్టీఆర్ వెయిట్ తగ్గడానికి జిమ్ లో భారీగా కష్టపడ్డాడు అనేది ఆ పై ఫోటో చూస్తేనే అర్ధమవుతుంది.
బాలీవుడ్ నుండి ట్రైనర్ ని తెచ్చుకుని ఎన్టీఆర్ జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. బాలీవుడ్ హీరోలకు పర్సనల్ గా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చే లార్డ్ స్టీవెన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ కి వచ్చాడు. మరి ఎన్టీఆర్.. లార్డ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో జిమ్ లో బరువును ఎత్తుతూ బాధ పడుతున్న ఆ ఫోటోని చూస్తుంటే ఎన్టీఆర్ కి ఉన్న డెడికేషన్ అర్ధమవుతుంది. మరి ఆ ఫోటో ని స్వయంగా లార్డ్ స్టీవెన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.... ట్రెయినర్... క్లైంట్ ఇద్దరూ ఒకే ఫలితం కోసం పిచ్చిగా కష్టపడుతుంటే... అంటూ ఒక కామెంట్ ని కూడా పోస్ట్ చేసాడు. మరి ఎన్టీఆర్ అంతగాకష్టపడుతూ తన ట్రైనర్ కే షాకిచ్చాడు.
ఎన్టీఆర్ ఇలా తన వెయిట్ తగ్గించుకుని దాదాపుగా న్యూ లుక్ లో కొచ్చేశాడు. ఇప్పటికే ఐపిల్ యాడ్ లో ఎన్టీఆర్ లుక్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. మరి ఇంకా త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఇంకా కొత్తగా వుంటుందని టాక్ వినబడుతుంది. ఇక ఎప్పుడో మొదలైన త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ల సినిమా ఈ నెల నుండే షూటింగ్ ని యమా ఫాస్ట్ గా అంటే... సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయాలనే కసితో ఉన్నారు.