Advertisementt

మధురవాణిగా మారిన రామలక్ష్మి..!

Sun 08th Apr 2018 12:55 AM
mahanati,samantha,rangasthalam,madhura vaani,ramalakshmi  మధురవాణిగా మారిన రామలక్ష్మి..!
Samantha Madhura Vani in Mahanati మధురవాణిగా మారిన రామలక్ష్మి..!
Advertisement
Ads by CJ

'రంగస్థలం'లో రామ్ చరణ్ చిట్టిబాబుగా రెచ్చిపోతే... సమంత మాత్రం రామలక్ష్మిగా అదరగొట్టేసింది. చిలిపి పాత్రలో పల్లెటూరి అమ్మాయిలా సమంత సూపర్బ్ నటన కనబర్చింది. అసలు రంగస్థలం లో రామలక్ష్మి పాత్రను ఇప్పట్లో మరిపోయేలా లేరు జనాలు. అంతలా అందరిని ఆకట్టుకుంది సామ్. పల్లెటూరమ్మాయిలా... లంగా వోణిలో.... కాటన్ చీరల్లో సమంత డి గ్లామర్ నటన సమంత కెరీర్ లో పది కాలాలు గుర్తుండిపోతుంది. మరి రంగస్థలంలో చిట్టిబాబుతో పాటుగా పేరు కొట్టేసిన సమంత ఇప్పుడు 'మహానటి'లో మధురవాణిగా టర్న్ తీసుకుంది. 'మహానటి' సినిమాలో ఒక కీ రోల్ ప్లే చేస్తున్న సమంత 'మహానటి' లుక్ బయటికి వచ్చింది.

సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా...  సమంత 'మహానటి' మూవీలో పోషిస్తున్న పాత్ర పేరు మధురవాణి. 'నా పేరు.. కన్యాశుల్కంలో సావిత్రి గారి పేరే'- మధురవాణి..... బీఏ - గోల్డ్ మెడల్.. అని సమంత చెబుతున్నట్లుగా తన ఫస్ట్ లుక్ ని తానే విడుదల చేసింది సమంత. మరి సమంత మహానటి లుక్ లో జర్నలిస్ట్ గానే కనబడుతుంది. అసలు సమంత మహానటిలో కీలక పాత్ర అనగానే.. అప్పుడే అందరూ సమంత జర్నలిస్ట్ పాత్ర పోషిస్తుందని ఫిక్స్ అయ్యారు. మరి ఇప్పుడు సమంత మధురవాణి లుక్ లో చుట్టూతా పుస్తకాలూ, ఫైళ్లు, పేపర్స్ మధ్యలో మధురవాణి ఉంది. దీన్నిబట్టి సమంత మహానటి లో జర్నలిస్ట్ పాత్రే పోషిస్తుందనేది మాత్రం పూర్తిగా అర్ధమవుతుంది.

మరి ఇంకా రంగస్థలంలో రామలక్ష్మి హవా పూర్తవకుండానే ఇపుడు మధురవాణిగా సమంత అదరగొట్టేస్తుంది. చక్కటి ఫుల్ హాండ్స్ షర్ట్ లో కళ్ళ జోడు  పెట్టుకుని సుదీర్ఘంగా ఆలోచిస్తున్న మధురవాణి పాత్రలో సమంత సూపర్ గా వుంది. మరి నిన్నటిదాకా రామలక్ష్మిలా అదరగొట్టిన సమంత ఇపుడు మధురవాణిగా మారిపోయింది. ఏ లుక్ లోనైనా సమంత మాత్రం అదరగొట్టేస్తుందనేది మాత్రం వాస్తవం. ఇకపోతే మహానటి మూవీ మే 9 న ప్రేక్షకులముందుకు రానుంది.

Samantha Madhura Vani in Mahanati:

Mahanati Movie Samantha Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ