Advertisementt

రంగకి కూడా త్రివిక్రమ్ నే టార్గెట్ చేస్తున్నారు!

Sat 07th Apr 2018 12:57 AM
pawan kalyan,trivikram srinivas,nithin,chal mohan ranga  రంగకి కూడా త్రివిక్రమ్ నే టార్గెట్ చేస్తున్నారు!
Chal Mohan Ranga Satires on Trivikram రంగకి కూడా త్రివిక్రమ్ నే టార్గెట్ చేస్తున్నారు!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ 'జై లవ కుశ' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీకి సైన్ చేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజ కూడా జరుపుకున్న ఎన్టీఆర్ సినిమా రేపో మాపో సెట్స్ మీదకి కూడా వెళ్లనుంది. ఎప్పటినుండో త్రివిక్రమ్ దర్శకత్వంలో పని చెయ్యాలని ఎన్టీఆర్ ముచ్చట పడుతున్నాడు. ఎట్టకేలకు ఇప్పడు ఆ కోరిక తీరింది. అయితే త్రివిక్రమ్ ఇప్పుడు 'అజ్ఞాతవాసి' సినిమాతో ఫామ్ కోల్పోయాడు. అయినా ఎన్టీఆర్, త్రివిక్రమ్ ని గట్టిగానే నమ్మి పూర్తి స్క్రిప్ట్ బాధ్యతలను త్రివిక్రమ్ మీదే పెట్టేశాడు. త్రివిక్రమ్ సినిమా కోసం దాదాపు 20 కేజీల బరువు కూడా తగ్గాడు ఎన్టీఆర్. అయితే త్రివిక్రమ్ ఎప్పుడు తన సినిమాల్లో కథను వేరే సినిమా, నవల్స్ నుండి కాపీ కొట్టిన తన మార్క్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడు.

కానీ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా విషయంలో త్రివిక్రమ్ కథ, కథనం కూడా బోల్తా పడింది. ఆకట్టుకునే మాటలు గాని డైలాగ్స్ గాని లేకుండా పోయాయి అజ్ఞాతవాసిలో. అలాగే త్రివిక్రమ్ ఇప్పుడు మరోమారు తన కథతో బోర్ కొట్టించాడు. నితిన్ హీరోగా పవన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో తెరకెక్కిన 'ఛల్ మోహన్ రంగ' కి త్రివిక్రమ్ కథని అందించాడు. అయితే 'ఛల్ మోహన్ రంగ' సినిమా కథ మరీ రొటీన్ గా చెత్తగా ఉందనే కామెంట్స్ పడుతున్నాయి. నిన్న శుక్రవారమే విడుదలైన 'ఛల్ మోహన్ రంగ' సినిమాలో మెయిన్ మైనస్ కథే అంటున్నారు. కథలో పసలేదు.. త్రివిక్రమ్ పెన్నులో ఇంకు లేదు అంటూ సెటైరికల్ గా కామెంట్స్ చేస్తున్నారు.

మరి అజ్ఞాతవాసి విషయంలో ఫెయిల్ అయిన త్రివిక్రమ్, ఇప్పుడు 'ఛల్ మోహన్ రంగ' కథ విషయంలోనూ ఫెయిల్ అయ్యాడు ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ సినిమా కథ పరిస్థితి ఏమిటో అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. త్రివిక్రమ్ సినిమాల్లో మనసుకు హత్తుకునే సన్నివేశాలు, డైలాగ్స్, కామెడీ ఇలా అన్ని విషయాల్లో త్రివిక్రమ్ మార్క్ మాత్రం ఈ రెండు సినిమాల్లో మిస్ కావడం ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది. మరి ప్రస్తుతం త్రివిక్రమ్ నే నమ్మి అన్ని బాధ్యతలను త్రివిక్రమ్ మీద పెట్టిన ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటో చూడాలి.

Chal Mohan Ranga Satires on Trivikram:

What’s Pawan, Trivikram Role In Chal Mohan Ranga?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ