Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Laya, Meena in Trivikram and Jr NTR film

త్రివిక్రమ్ ఈసారి ఇద్దర్ని దించుతున్నాడు!

Laya, Meena in Trivikram and Jr NTR film

అజ్ఞాతవాసి ప్లాప్ ని వదిలించుకోవడానికి దర్శకుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో చేసే సినిమా కోసం చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత కనీసం బయటికి కూడా రాకుండా ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ ని పకడ్బందీగా లాక్ చేస్తున్నాడు. అంతే కాకూండా సినిమాలో నటీనటుల విషయంలోనూ త్రివిక్రమ్ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అజ్ఞాతవాసితో పోయిన పేరును ఎన్టీఆర్ సినిమాతో తిరిగి పొందడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఇకపోతే తన సినిమాల్లో సీనియర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ గతంలో హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిన మాజీ హీరోయిన్స్ ని తీసుకొచ్చి తన సినిమాల్లో మూల స్తంభాలుగా నిలబెడుతుంటాడు త్రివిక్రమ్.

నదియాకి అత్తారింటికి దారేదిలో ఒక కీ రోల్ పోషించే పాత్ర ఇచ్చి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కి హెల్ప్ అయిన త్రివిక్రమ్... పదేళ్లపాటు తెలుగుకి దూరమైన ఖుష్బూని తీసుకొచ్చి అజ్ఞాతవాసి సినిమాలో కీలక పాత్ర ఇచ్చాడు. ఇక ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సినిమా కోసం ఇద్దరు మాజీ హీరోయిన్స్ ఎంపిక చేసే ప్రయత్నంలో త్రివిక్రమ్ ఉన్నాడు. ఎన్టీఆర్ పక్కన ప్రస్తుతం ఫుల్ క్రేజ్ లో ఉన్న పూజ హెగ్డేని హీరోయిన్ గా తీసుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్, పూజ హెగ్డేల తల్లులు కింద ఒకప్పటి టాప్ హీరోయిన్ మీనని, లయని సంప్రదిస్తున్నాడట. ప్రస్తుతం వీరిని ఒప్పించే ప్రయత్నాలు త్రివిక్రమ్ స్టార్ట్ చేశాడట.

ఇంకా సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్న మీనా, ప్రస్తుతం సినిమాలకు దూరమై కుటుంబంతో హ్యాపీగా గడిపేస్తున్న లయ ఇప్పుడు ఎన్టీఆర్, పూజలకు అమ్మలుగా ఒప్పుకుంటారా.. అనేది మాత్రం పెద్ద డౌట్. అయితే లయ ప్రస్తుతం రవితేజ సినిమాలో నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో జగపతి బాబుని విలన్ గా తీసుకునే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడు. మరి ఇలా స్టార్ కాస్ట్ తోనే సినిమాపై సగం ఇంట్రెస్ట్ అందరిలో కలగజేస్తున్నాడు త్రివిక్రమ్.

Senior Heroines for NTR And Trivikram Movie

laya
meena
trivikram srinivas
ntr movie
mother