కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ఖాన్‌కి జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, 10వేలు జరిమానా విధించింది. ఇక కృష్ణ జింకలను దైవంగా భావించే ఓ వర్గం వారు ఈ విషయంలో సాక్ష్యం చెప్పారు. ఇక 1998 అక్టోబర్‌లో 'హమ్‌సాథ్‌సాథ్‌హై' షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ కేసులో సైఫ్ అలీఖాన్, టబు, సోనాలిబింద్రేలు కూడా నిందితులుగా ఉన్నారు. కానీ కోర్టు ఈ ముగ్గురికి కేసులో సంబంధం లేదని తీర్పునిచ్చింది. నిజానికి సల్మాన్ ఈ సంఘటన జరిగిన సమయంలో జీపులోనే ఉన్న టబు ఆ కృష్ణ జింకను చంపమని సల్మాన్‌ని ప్రోత్సహించినట్లు ఓ ప్రత్యక్షసాక్షి చెప్పినా కూడా కోర్టు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు 2009లో ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ మాట్లాడుతూ, ఆ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు తమకి కృష్ణజింకలు ఎదురయ్యాయని, వాటికి తాను బిస్కెట్స్ తినిపించానని, అంతలో ఓ కృష్ణజింక పొదలో ఇరుక్కుని పోయి బయటికి రాలేక ఇబ్బందులు పడుతుంటే తానే దానిని బయటికి తీసి బిస్కెట్స్ తినిపించి, మంచి నీరు తాగించానని సల్మాన్ చెప్పాడు. కానీ జోధ్‌పూర్ కోర్టు మాత్రం సల్మాన్‌ని దోషిగా భావించి ఐదేళ్ల జైలు, 10వేల జరిమానా విధించింది. ఇక సల్మాన్‌ని దోషిగా ప్రకటించే సమయంలో కోర్టులో సల్మాన్ సోదరిమణులు అర్పితా, అల్విరా కూడా ఉన్నారు. తీర్పు వెలువడిన వెంటనే సల్మాన్ బోరున ఏడవగా ఆయన సోదరీమణులు ఆయనను ఓదారుస్తూ వాళ్లు కూడా ఏడ్చారు. ఆ తర్వాత సల్మాన్‌కి యాంటీ డిప్రెసెంట్ మందులు ఇచ్చారు. ఇక సల్మాన్‌ని జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో రెండో బరాక్‌లో ఉంచారు. ఇందులో స్కూల్ అమ్మాయిని అత్యాచారం చేసిన కేసులో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారం బాపు కూడా అదే బేరాక్‌లో ఉన్నారు.
ఇక సల్మాన్‌కి కొంతకాలంగా చంపుతామని బెదిరింపులు వస్తున్న మాఫియా డాన్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తీవ్ర బెదిరింపులు వస్తూ ఉండటంతో జైలులో సల్మాన్‌కి భారీ భద్రత ఏర్పాటు చేశారు. సల్మాన్‌ని సాధారణ ఖైదీగానే పరిగణిస్తామని, ఆయన కంటూ ప్రత్యేక సదుపాయాలు ఉండవని జైలు అధికారులు తెలిపారు. మరోవైపు సల్మాన్ ప్రస్తుతం 'రేస్ 3' చిత్రం చేస్తున్నాడు. దీని తర్వాత 'భరత్, దబాంగ్3, కిక్ 2' సినిమాలు కూడా సల్మాన్ చేయాల్సి వుంది. దాంతో ఆయన నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈయన 'దస్‌కా దమ్'తో పాటు 'బిగ్‌బాస్'ని కూడా హోస్ట్ చేయాల్సివుంది. మరోపక్క తన సోదరి భర్తతో ఆయన 70కోట్ల బడ్జెట్‌తో ఓ చిత్రం కూడా నిర్మిస్తున్నాడు. ఇక సల్మాన్ నాడు హిట్ అండ్‌రన్ కేసులోంచి బయటపడినా నేడు కృష్ణజింకల విషయంలో మాత్రం ఆయనకు శిక్ష పడింది. మరోముఖ్య విషయం ఏమిటంటే.. ఈ దేశంతోనే ఏ సంబంధం లేని పాకిస్తాన్ విదేశీవ్యవహారాల మంత్రి సల్మాన్ కేవలం ముస్లిం కావడం వల్లే ఇంత పెద్ద శిక్ష విధించారని, అదే ముస్లిం ప్రధాన మంత్రిగా ఉండి ఉంటే ఇంత కఠిన శిక్ష పడకుండా ఉండేదని అర్ధరహిత వ్యాఖ్యలు చూస్తూ దీనికి మతం రంగు పులిమే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. ఇక ఈయనకు ఖైదీనెంబర్ 106 నెంబర్‌ని కేటాయించారు.