సుకుమార్ మొదలు పెట్టిన ఏడాదికి పైగా కాలం రామ్‌చరణ్ పక్కా పల్లెటూరి గెటప్‌లో, గుబురు గడ్డం పెంచి, పెరిగిన జుట్టుతో కనిపించాడు. 'బాహుబలి' కోసం ప్రభాస్, రానాలు దాదాపు ఐదేళ్లు ఉండటం ఎలాగో చేసిి చూపించారు. ఇప్పుడు అదే కమిట్‌మెంట్‌ను రామ్‌చరణ్ సుకుమార్ విషయంలో 'రంగస్థలం'పై చూపించాడు. సాధారణంగా ఎవరికైనా గుబురుగా గడ్డం, తలంతా ఎక్కువ జుట్టుతో ఉంటే బాగా చికాకు వేస్తుంది. కానీ 'రంగస్థలం' కోసం చరణ్ ఇవ్వన్నీ భరించాడు. సుకుమార్ చెప్పిన లుక్‌లోకి, చివరకు ఆయన చెవిటి మిషన్ పెట్టుకోమని చెప్పినా కూడా తాను స్టార్‌ని. అభిమానులు హర్ట్ అవుతారేమో అని కూడా చూడకుండా సినిమాకి దర్శకుడు తండ్రి. బయట ఎలా ఉన్నా... షూటింగ్ స్పాట్‌లో మాత్రం దర్శకుడు చెప్పిందే చేయాలని, ఆయనే కెప్టెన్ ఆఫ్‌ది షిప్‌గా భావించి, ఆయన మాటకే విలువ ఇచ్చాడు. ఇక ఇలాంటి సబ్జెక్ట్‌ని ఈ టైంలో చేయడం ఇబ్బందేనని చిరు భావించినా కూడా అన్నివిషయాలలో సుకుమార్ చెప్పిందే చేద్దాం.. అని తన తండ్రిని కూడా కన్విన్స్ చేసి చివరకు అదే మెగాస్టార్ ఫస్ట్‌కాపీనీ చూసిన తర్వాత సినిమా నిడివి ఎక్కువైనా ఫర్వాలేదు. ఒక్క సీన్ కూడా ఎడిట్ చేయవద్దని చిరంజీవి చేతే అనిపించారు.
ఇక 'రంగస్థలం' విషయంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్, ఆయన శ్రీమతి ఉపాసనలు ఎంత సంతోషంగా ఉన్నారో తెలియదు గానీ మెగాభిమానుల ఆనందం మాత్రం ఆకాశాన్ని తాకుతోంది. ఇక తాజాగా తన భర్తకి అంటే మిస్టర్ సికి సంబంధించిన అన్ని సంఘటనలు, హ్యాపీ మూమెంట్స్, పిక్‌లు ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన భర్తతో కలిసి దిగిన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో చరణ్ నీటుగా క్రాఫ్ చేసుకుని, గడ్డాన్ని ట్రిమ్ చేసుకుని కనిపిస్తూ ఎంతో యాక్టివ్‌గా ఉన్నాడు. మిస్టర్ సితో మెమరబుల్ మూమెంట్ అని తాను కూడా ఎంత ఆనందంగా ఉందో తెలిపింది. ఇక గడ్డం, క్రాఫ్‌తో కనిపించిన రామ్‌చరణ్ ప్రస్తుతం ఐదు కేజీల బరువు తగ్గినట్లుగా ఉంది అంటూ భారం దిగిపోవడం వల్ల కలిగిన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈయన ప్రస్తుత లుక్ చూస్తుంటే మరోసారి పాత యాక్షన్, మాస్ లుక్కే కనిపిస్తోంది. మరి ఈ ఫొటోలోని గెటప్‌లోనే రామ్‌చరణ్ బోయపాటి శ్రీను చిత్రంలో కనిపిస్తాడా? లేక ఈ కొద్దిరోజుల్లో మేకోవర్ సాధించి బోయపాటి శ్రీను చిత్రంలో కొత్తగా కనిపిస్తాడా? అనేది వేచిచూడాల్సివుంది....!