తెలుగులో నిన్నటితరం యాంకర్లలో సుమ, ఝూన్సీ, ఉదయభాను వంటి వారి గురించి బాగా చెప్పుకుంటారు. ఇక సుమ అయితే కేరళ అమ్మాయి అయినా తెలుగును ఎంతో చక్కగా మాట్లాడుతూ, అనర్ఘళంగా, స్పాంటేనియస్‌గా మాట్లాడుతుంది. ఈమె ఎంటర్ టైన్ మెంట్ షోలను హోస్ట్ చేయడంలో దిట్ట. ఇక ఝూన్సీ విషయానికి వస్తే ఆమె సామాజిక చైతన్యం కలిగించే షోలను బాగా హోస్ట్ చేస్తుంది. వీరి తర్వాత చెప్పుకోదగిన యాంకర్ శిల్పా చక్రవర్తిని గురించి చెప్పుకోవాలి. ఈమె కూడా తెలుగమ్మాయి కాదు. కానీ సుమ లానే ఈమె కూడా తెలుగులో అద్భుతంగా మాట్లాడుతుంది. ఓ ఇంటర్వ్యూలో సుమ, ఝాన్సీలు మాట్లాడుతూ, మా ఇద్దరికి ఇష్టమైన హోస్ట్ శిల్పా చక్రవర్తి అని చెప్పారు. ఇక ఈమె మొదట్లో తెలుగు రాక చాలా ఇబ్బందులు పడింది. 'కంటే కూతుర్నే కను' సీరియల్ షూటింగ్‌లో రాత్రి ప్రసారం కావాల్సిన షూటింగ్ సాయంత్రం జరుగుతోంది. తొందరగా షూటింగ్ ముగించాలని టెన్షన్. ఆ సమయంలోనాకు పేజీల కొద్ది డైలాగ్‌లు రాసి ఇచ్చారు.
నాకు ప్రామిటింగ్ అలవాటు కాదు. చివరకు కో డైరెక్టర్‌ని డైలాగ్ పేపర్ అడిగాను. ఆయనకు కోపం వచ్చి ఇలాంటి వారిని తెచ్చి మా తల మీద రుద్దుతారో చూడండి. తెలుగురాని వారిని తీసుకొచ్చి మమల్ని విసిగిస్తున్నారు. మేము షాట్ చూసుకోవాలా? దర్శకుడు చెప్పింది చేయాలా? లేక నీలాంటి తెలుగు రాని వారికి భాషని నేర్పిస్తూ కూర్చోవాలా? అని పెద్దగా అరిచాడు. అది నేను ఎంతో అవమానంగా ఫీలయ్యి, ఇప్పటికీ దానిని మర్చిపోలేదు. ఇక నేను తొలిసారీ స్టేజీ పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది పవన్‌కళ్యాణ్ గారి 'ఖుషీ' చిత్రం. ఈ ఈవెంట్‌ని నువ్వే చేయాలి. పవన్ కళ్యాణ్‌ని నీవే స్టేజీ పైకి ఆహ్వానించాలి అని చెప్పారు. అసలే మొదటి షో.. అందునా పవన్ కార్యక్రమం. పవన్ అంటే చిరంజీవి గారు కూడా వస్తారు. దాంతో నేను భయంతో వణికి పోయాను. తర్వాత నిర్వాహకులు నీ పక్కన ఝాన్సీ కూడా ఉంటుంది. ఆమె పక్కనే నువ్వు ఉండు అని చెప్పడంతో కాస్త కంగారు తగ్గింది . స్టేజీపై ఝాన్సీ గారి టాలెంట్ చూసిన తర్వాత నేనైతే అలా చేయలేను అనిపించింది. కానీ ఝాన్సీ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆ సభలో పవన్‌కళ్యాణ్‌కి ఉన్న ఫాలోయింగ్, అభిమానులను చూసి షాక్‌కి గురయ్యాను అని చెప్పుకొచ్చింది....!