'రంగస్థలం' చిత్రంలో హీరో చిట్టిబాబు స్నేహితునిగా నటించిన జబర్ధస్త్ మహేష్ పేరు నేడు ప్రతి చోటా మారుమోగిపోతోంది. తన గురించి తాను మహేష్ మాట్లాడుతూ, రామ్‌చరణ్, సుకుమార్‌ల గారి వల్లనే అంతటి డెప్ట్ ఉన్న ఎమోషన్స్ సీన్స్ చేయగలిగాను. నాలోని కామెడీ టైమింగ్ 'జబర్దస్త్' వల్ల మెరుగయింది. మిగిలిన ఎమోషన్స్‌ని తర్వాత నేర్చుకున్నాను. నేను మొదటిసారిగా వెల్డింగ్ శ్రీను అనే దర్శకుని 'ఒకే ఒక్క చాన్స్' చిత్రంలో సింగిల్ డైలాగ్‌ని చెప్పాను. తర్వాత 'నా ఇష్టం'లో మంచి పాత్ర చేశాను. నాకు మొదట 'సినిమా చూపిస్తమావా' రచయిత ప్రసన్న పరిచయం అయ్యాడు. ఆయనెంతో సాయం చేశారు. తర్వాత నాగబాబు గారు కలిశారు. ఆయన నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఇక నేనేమి స్పాంటేనియస్‌గా డైలాగ్స్ చెప్పను. దర్శకులు రాసిచ్చిన డైలాగ్‌లు చెబుతాను. అయితే నా డైలాగ్ మాడ్యులేషన్ స్పీడ్‌గా ఉంటుంది. అది కూడా ఓ ప్రత్యేకంగా ఉందని అందరు అంటున్నారు. ఇక నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. చిరంజీవి, రవితేజ ఆంటే ఇష్టం. ఎందుకంటే వారు కష్టపడి పైకి వచ్చారు.
నేను కూడా కష్టపడితే ఏదో ఒకటి సాధిస్తానని, కామెడియన్ గానో లేక సైడ్ ఆర్టిస్టో ఏదో ఒకటి అవుతాననే నమ్మకం ఏర్పడింది. మా నాన్నగారు మరణించారు. మొదట్లో వీడు ఇండస్ట్రీ అంటున్నాడు. ఎక్కడ చెడిపోతాడో అని అమ్మ భయపడింది. ఇప్పుడు నాకు వచ్చిన గుర్తింపు చూసి ఎంతో ఆనందంగాఉంది. ఇక కేవలం కామెడీ అనేకాదు. విలన్, ఎమోషన్స్ ఇలా ఉగాది పచ్చడిలా అన్ని రసాలు పోషించాలని ఉంది. నన్ను నేను అన్ని రకాలుగా నిరూపించుకోవాలని భావిస్తున్నాను. ప్రస్తుతం దిల్‌రాజు-నితిన్‌ల 'శ్రీనివాస కళ్యాణం, మహానటి' చిత్రాలలో నటిస్తున్నాను. 'మహానటి'లోమంచి పాత్ర. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మనందరికి ఇష్టమైన సావిత్రి గారి బయోపిక్‌లో అవకాశం రావడం నా అదృష్టం. ఎంత వారసత్వం ఉన్నా ప్రతిభ కావాలి. వారసత్వం ఉన్నవారు ఎందరో ఉన్నారు. కానీ వారిలో ప్రతిభ ఉన్న వారే స్టార్స్ అవుతారు. దేవుడు ఎంత టాలెంట్ ఇస్తే దానిని ఉపయోగించుకొని అంత దూరం వెళ్తారు. ఇక నేను డిగ్రీ పూర్తి చేసన తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. ప్రైవేట్‌గా ఎంబీఏ చేరాను. రెండు మూడు సబ్జెక్ట్ పెండింగ్ రావాడంతో నాకిష్టమైన నటనపై దృష్టి పెట్టాను..అంటూ చెప్పుకొచ్చారు.