తమన్నాకి కెరీర్ లో బంపర్ హిట్ సినిమా లేకపోయినా ఆమె కున్న గ్లామర్ తో గత ఏడెనిమిదేళ్ళుగా సినిమాలలో హీరోయిన్ గా తనదయిన ముద్ర వేసింది. బాహుబలి అంతటి సినిమాలో భాగమైన తమన్నాకి మాత్రం ఆ సినిమా శాపమనే చెప్పాలి. బాహుబలి తర్వాత తెలుగు తెరకు దాదాపుగా దూరమవుతున్న తరుణంలో కళ్యాణ్ రామ్ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఎప్పుడూ గ్లామర్ తో పాల మెరుపులా మెరిసిపోయే తమన్నాకి ఇప్పుడు ఆ మెరుపు పూర్తిగా తగ్గిందనే చెప్పాలి. అస్సలు అవకాశాలు లేని తమన్నా ఎంతగా అందాలు ఆరబోసినా అమ్మడుకి అస్సలు ఉపయోగం లేకుండా పోయింది.
తమన్నా ఇది వరకు ఏ డ్రెస్ లో కనబడినా అందరూ ఆమెని పిచ్చగా ఆరాదించేవారు. కానీ ఇప్పుడు తమన్నా ఫోటో అంటేనే లైట్ తీసుకుంటున్నారు. తాజాగా తమన్నా తన ఫ్రెండ్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ అయిన ఒకామె డిజైనర్ బట్టలును డిజైన్ చేసి తమన్నాకి వేసి ఫోటో షూట్ కూడా చేసింది. ఆ బట్టల్లో తమన్నా మెరిసిపోతూ ఉంది కానీ.... తమన్నా మాత్రం ఏ కోశానా పెద్దగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. మరి తమన్నా మెరుపులు తగ్గాయనడానికి దీనికన్నా ఉదాహరణ ఇంకేం కావాలి. ఇక మ్యాగజైన్స్ కోసం, ఇలా ఫ్యాషన్ వేర్ కోసం ఎంతగా హాట్ ఫోటో షూట్స్ చేసినా తమన్నాకి ఇక అవకాశాలు రావని పూర్తిగా అర్ధం చేసుకుని దుకాణం సర్దేసుకుంటే బెటర్ అన్నట్టుగా తయారైంది ఆమె పరిస్థితి.
మరి కొత్త హీరోయిన్స్ హవాతో తమన్నాకి ఛాన్స్ లు తగ్గినా అమ్మడు మాత్రం ఐటమ్స్ అంటూ అదరగొడుతున్నా కానీ ఉపయోగమే లేకుండా పోయింది. ఇక ఐపీల్ వంటి ఈవెంట్స్ లో తమన్నా స్టేజ్ పై డాన్స్ లు వెయ్యడానికి రెడీ అవుతున్న ఈ భామని ఎవరైనా పట్టించుకుంటారో లేదో కూడా తెలియదు.