ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఏంటో మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. బాహుబలి తర్వాత వస్తున్న సాహో సినిమాకి కూడా 150 కోట్ల పైన బడ్జెట్ పెడుతున్నారు. ఇది ఒక్క తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
బాహుబలి క్రియేట్ చేసిన రికార్డులను దృష్టిలో పెట్టుకునే ఈ స్థాయిలో బడ్జెట్ పెడుతున్నారు. అయితే ప్రభాస్ సాహో తర్వాత చేసే సినిమాకి కూడా అదే తరహా బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. చిన్న లవ్ స్టోరీ అయిన 100 కోట్ల పైనే బడ్జెట్ అవుతుందంట. ఈ సినిమాను జిల్ డైరెక్టర్ రాధా కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇది ఒక లవ్ స్టోరీ అన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా స్టోరీ కంప్లీట్ చేసుకున్నాడు డైరెక్టర్ రాధా. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ ని వాడనున్నారట. చాలా వరకు షూటింగ్ విదేశాల్లోనే ఉంటుంది. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఆధారంగా సినిమాను భారీ స్థాయిలో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. లవ్ స్టోరీకి ఇంత బడ్జెట్ అంటే మింగుడు పడని విషయం. బాలీవుడ్ లో స్టార్ హీరోస్ లవ్ స్టోరీస్ కి ఇంత బడ్జెట్ తో చేయలేదు. అయితే వారు ఒక్క భాషాకే పరిమితం. కానీ ప్రభాస్ సినిమా అంటే దేశం మొత్తం ఎగబడి చూస్తారు కాబట్టి ఆ రేంజ్ లో నిర్మిస్తున్నారు. మరి సినిమా ఏ రేంజ్ లో జనాలు ఆదరిస్తారో చూడాలి.