మహిళలను, బ్రాహ్మణులను మోసం చేసినా, పిల్లిని, ఆవుని కొట్టినా, చంపినా దాని ఉసురు ఊరికే పోదని మన పురాణాలు, మనపెద్దలు చెబుతూ ఉంటారు. అలా నయనతారని వివాహం చేసుకుంటానని చెప్పి, తనకున్న భార్యకి కూడా తెలియకుండా ఎఫైర్ నడిపిన కొరియో గాఫ్రర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా చివరకు తన భార్య ఒత్తిడి వల్ల నయనతారను అడ్డంగా మోసం చేశాడు. కానీ విచిత్రంగా ఈబ్రేకప్ అయిన తర్వాత నయనతార లేడీ సూపర్ స్టార్‌గా దూసుకు పోతుంటే అప్పటి వరకు తెలుగు, తమిళ చిత్రాలను బాలీవుడ్‌లో రీమేక్స్ చేసుకుంటూ వచ్చిన ప్రభుదేవా కెరీర్ పరంగా వరుస పరాజయాలతో ఫామ్‌ని పొగొట్టుకున్నాడు. ఇక ఈయన ఇప్పుడు రాఘవలారెన్స్ కంటే దిగువ స్థాయిలోఉన్నాడు. నడిగర్ సంఘం బిల్డింగ్ కోసం విశాల్, కార్తిలు ఫ్రీగా నటిస్తామని చెప్పిన చిత్రం కూడా ప్రభుదేవా చేతుల నుంచి జారిపోయింది. ఇక ఈయన ప్రస్తుతం 'మెర్క్యురీ, గులేభకావళి'లతోపాటు బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ హీరోగా నటించనున్న'దబాంగ్ 3'కి దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈయనకు తెలుగులో కూడా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' తప్పితే 'పౌర్ణమి, శంకర్‌దాదా జిందాబాద్'ల ద్వారా ప్రభాస్, చిరంజీవిలు ఇచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇటీవల తాను ప్రభాస్‌తో సినిమా చేస్తున్నానని ప్రకటించాడు. కానీ అది నిజం కాదని తేలింది.
ఇక ఈయన తన 45వ పుట్టినరోజు సందర్భంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమిటో చెప్పాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 'బాహుబలి, రంగస్థలం' తరహా చారిత్రక నేపధ్యం, 'సై..రా..నరసింహారెడ్డి' వంటి బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇంకొందరిలో మోహన్‌లాల్ వెయ్యి కోట్లతో 'రాండామూజం' అనే పేరుతో మహాభారతాన్నిఆవిష్కరిస్తానని, ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దీనికి కుమార్ దర్శకత్వం వహిస్తానని చెప్పినా అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇక అల్లుఅరవింద్ 'గజిని' బాలీవుడ్ నిర్మాతలతో కలసి 'రామాయణం' తీస్తామని, ఇటీవల యుపి ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకున్నారు. మరోవైపు జక్కన తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని, అది ఇప్పుడు కాదని తెలిపాడు. తనకి ఇంకా చాలా అనుభవం వస్తే గానీ దానిని చేయలేనని, కానీ తన జీవితంలోఖచ్చితంగా 'మహాభారతం' తీస్తానని చెప్పి, తనకి యుద్దాలంటే ఇష్టమని చెప్పాడు. ఇక తాజాగా ప్రభుదేవా మాట్లాడుతూ, 'రామాయణం' తీయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, కానీ దానిని తెరకెక్కించాలంటే 5వందల నుంచి 6వందల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఆ బడ్జెట్‌కి మన సినిమా చేరాలంటే మరో ఐదారేళ్లు పడుతుందని సెలవివ్వడం విశేషం. ఆ స్థాయి భారతీయ సినిమా ఎప్పుడో చేరుకుందని ఆ విషయం ప్రభుదేవానే గుర్తించడం లేదని కొందరు ఆయనేంటి 'రామాయణం' ఏమిటి? అని సెటైర్లు వేస్తున్నారు.