Advertisementt

'రంగస్థలం'పై ప్రశంసల వర్షం తగ్గలేదు..!

Thu 05th Apr 2018 07:32 PM
venkatesh,manchu manoj,rangasthalam,ram charan,sukumar,samantha  'రంగస్థలం'పై ప్రశంసల వర్షం తగ్గలేదు..!
Praises Continues to Rangasthalam 'రంగస్థలం'పై ప్రశంసల వర్షం తగ్గలేదు..!
Advertisement
Ads by CJ

'రంగస్థలం' చిత్రం సృష్టిస్తున్న ప్రభంజనం మామూలుగా లేదు. ఈ చిత్రం 100కోట్లను మెదటి వీకెండ్‌లోనే దాదాపు సాధించి, సోమ, మంగళ వారాలలో కూడా స్టడీగా నడుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం నాన్‌ బాహుబలి రికార్డులైన 'ఖైదీనెంబర్‌ 150, శ్రీమంతుడు' రికార్డులకు చెక్‌ చెబుతుందని అందరు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ నుంచి నమ్రతా వరకు అందరు ప్రశంసిస్తున్నారు. రామ్‌చరణ్‌, సమంత, ఆదిపినిశెట్టి, జగపతిబాబు, అనసూయలతో పాటు ఈ చిత్రంలోని మిగిలిన నటీనటులను, సాంకేతిక నిపుణులను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక ఆది పినిశెట్టి మరణించే సీన్‌కి, జగపతిబాబు చుట్ట నోట్లో పెట్టుకుని, పాలు పితుకుతూ, పంచెకట్టి చేసిన రఫ్‌లుక్‌లో కూడా సూపర్‌గా ఉన్నాడని ప్రశంసలు వస్తున్నాయి. ఇక స్టైలిష్‌ బిజినెస్‌మేన్‌గా 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో జగపతిబాబు ఎంత సెక్సీగా ఉన్నాడో, రంగస్థలంలో కూడా మొరటు గెటప్‌లో కూడా అంత బాగున్నాడని, సెక్సీగా ఉన్నాడని ప్రశంసలు దక్కుతున్నాయి. దానికి సుకుమార్‌ చెబుతూ, బంగారం ఏ రూపంలోఉన్నా దాని విలువ తగ్గదు. అదే జగపతిబాబు ఏ పాత్ర చేసినా ఆయన విలువ తగ్గదని పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక సాధారణంగా హీరోయిన్లకి పెళ్లయిన తర్వాత ఇమేజ్‌, ప్రేక్షకులు చూసే దృష్టి మారుతుందని అందరు భావిస్తారని, తాను కూడా అదే అనుకున్నానని, కానీ చిరంజీవి గారు మాత్రం సమంత మంచినటి. ఆమెనే పెట్టుకోండి.. జనాలు ఆదరిస్తారని భరోసా ఇచ్చారని, పెళ్లయిన తర్వాత కూడా హీరోయిన్ల ఇమేజ్‌లో తేడా రాదనే కొత్త రూల్‌ని సమంత తెలుగు ఫీల్డ్‌లో తీసుకు వచ్చిందని సుకుమార్‌ అన్నారు.

ఇక మోహన్‌బాబు కూడా ఈ చిత్రం చూసి చిరంజీవి ఎంత పుత్రోత్సాహంతో ఉన్నాడో అంటూ తన మనసులోని భావాలను బయటపెట్టాడు. ఇప్పుడు తాజాగా విక్టరీ వెంకటేష్‌ కూడా ఈ చిత్రం చూసి స్పందించాడు. ఇప్పుడే సినిమా చూశా. చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ అద్భుతంగా, పర్‌ఫెక్ట్‌గా ఉన్నాడు. పాత్రలను ఎంతో ప్రభావవంతంగా చూపించిన సుకుమార్‌కి హ్యాట్సాఫ్‌. మైత్రి మూవీమేకర్స్‌, ఇతర బృందానికి హ్యాట్సాఫ్‌ తెలిపాడు. ఇక మంచు మనోజ్‌ మాట్లాడుతూ, ఇంతకు ముందు ఏచిత్రం చేయని విధంగా 'రంగస్థలం' అందరి ప్రశంసలను పొందింది. నా స్నేహితులు రామ్‌చరణ్‌, ఆదిపినిశెట్టిలు ట్రీట్‌ ఇచ్చారు. చిట్టిబాబు, కుమార్‌బాబులుగా అద్భుతంగా నటించారు. నా సోదరులకు, బలమైన బృందానికి శుభాకాంక్షలు. రామలక్ష్మిగా సమంత నటిగా మరో స్థాయికి ఎదిగారు. అద్భుతమైన నటీనటులు తమనటనతో ఆకట్టుకున్నారు. దీని వెనుక ఉన్న సుకుమార్‌కి నా హగ్‌. ఈ చిత్రాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. సెల్యూట్‌. సుకుమార్‌కి నేనెప్పుడు అభిమానినే. నా అభిమానాన్ని 'రంగస్థలం' మరింత పెంచింది అని సంతోషం వ్యక్తం చేశాడు. 

Praises Continues to Rangasthalam:

Venkatesh and Manchu Manoj Praises Rangasthalam Team

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ