ఇండస్ట్రీలోకి వచ్చి 'స్టూడెంట్ నెంబర్1, ఆది, సింహాద్రి' వంటి చిత్రాల సమయంలో అనుభవ రాహిత్యం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అందరి పట్ల ఎంతో దురుసుగా ప్రవర్తించేవాడు. కానీ ఇటీవలే తనకు పెళ్లయిన తర్వాత పిల్లాడు పుట్టిన తర్వాత మెచ్యూరిటీ వచ్చిందని ఒప్పుకున్నాడు. ఇక ఈయన బాలకృష్ణని ఇప్పటికీ బాబాయ్ అని పిలుస్తున్నా, బాలయ్య వైపు నుంచి జూనియర్ మాట కూడా వినిపించదు. ఇక తాజాగా ఎన్టీఆర్ 'బిగ్‌బాస్' తర్వాత మరోసారి బుల్లితెరపై కనిపంచకున్నాడు. ఐపిఎల్ మ్యాచ్‌లను తెలుగు కామెంటరీతో ప్రసారం చేసే బాధ్యతను తెలుగు ప్రమోటర్‌గా ఎన్టీఆర్ నియామకం అయ్యాడు. ఈ యాడ్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. 'వివోఐపిఎల్' తెలుగులో వస్తోందిరా.. అని ఆర్.జె. హేమంత్ అంటాడు. దానికి ఓ స్నేహితుడు, టివిలో వస్తే చాలు కదరా? తెలుగులో స్పెషల్ ఏంటి? అంటాడు. దానికి ఎన్టీఆర్ 'కారం లేని కోడి, ఉల్లిపాయ లేని పకోడి, పెట్రోల్ లేని గాఢీ, పరుగెత్తడం రాని కేడీ, ఆవకాయ లేని జాడీ, ఆటల్లేని బడి, అమ్మపేరు లేని ఒడి..' అంటూ త్రివిక్రమ్ రాసిన డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇక తనకు ఊహ వచ్చినప్పటి నుంచి తన తండ్రి చూస్తుండటం వల్ల అది తనకి అబ్బిందని, రేపు నా కుమారుడు క్రికెటర్ కావాలా వద్దా అనేది వాడి నిర్ణయమని చెప్పాడు. తనకి ఊహ వచ్చిన వయసులో సచిన్ టెండూల్కర్ ఎంట్రీ ఇచ్చాడని, తనకు సచిన్ ఫేవరేట్ క్రికెటర్ అని, ఇప్పుడు ధోని అన్నా ఇష్టమేనని చెప్పాడు. అలాగని ఇతరులను తక్కువ చేయడం లేదని, తన దృష్టిలో మాత్రం సచిన్ సచినే అని తెలిపాడు. ఇక తాతయ్య బయోపిక్‌లో నటిస్తారా? అంటే దానికి సంబంధించిన నాకే విషయమూ ఇప్పటికీ ఎవ్వరూ ఏమి చెప్పలేదన్నాడు. ఆట భాషలాంటిదే అని, క్రీడల వల్ల కూడా కమ్యూనికేషన్ పెరుగుతుందని చెప్పాడు. సో.. మొత్తానికి ఎన్టీఆర్‌కి బాలయ్య బయోపిక్ లాంచ్‌కి ఆహ్వానం పంపని విషయం నిజమేనని ఈ వ్యాఖ్యలతో రుజువవుతోంది...!