ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Roja Ramani About Megastar Chiranjeevi

చిరు మెగాస్టార్‌ అవడానికి అదే కారణం!

Roja Ramani About Megastar Chiranjeevi

సినిమా నటీనటులు ఆధారపడేది అభిమానులు, ప్రేక్షకుల మీద. వారికి జీవితంలో ఎప్పుడో ఒకటి రెండు సార్లు మాత్రమే తమ హీరోని దగ్గరగా చూసి, మాట్లాడే అదృష్టం వస్తుంది. బహుశా ఒక అభిమాని ఓ సారి తన హీరోని కలుసుకుని ఫొటో తీసుకుని, మాట్లాడాలని భావించినా కూడా అది వీలుకాకపోతే అతను తన జీవితంలో మరోసారి అలాంటి చాన్స్‌ దొరుకుతుందో లేదో కూడా తెలియదు. ఈ విషయం మెగాస్టార్‌ చిరంజీవికి తెలిసినంతగా ఇతరులకు తెలియదనే చెప్పాలి. చిరంజీవి స్వతహాగా ఎలాంటి వాడు? అనే విషయం పక్కన పెడితే ఆయన అభిమానులకు ఇచ్చేగౌరవం, మర్యాదలు ఎంతో గొప్పగా ఉంటాయి. ఎంతటి స్థితిలో, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా అభిమానులు వచ్చి కలిస్తే వారితో ఫోటోలు దిగి, మాట్లాడి సంతోష పరిచి పంపిస్తారు. ఈ విషయంలో ఆయనకు దరిదాపుల్లోకి వచ్చేవారు కూడా ఎవ్వరూ ఉండరు. 

అందుకే ఆయన తన ఫ్యామిలీ నుంచి వచ్చేకొత్త హీరోలకు ఒక అభిమానిని కలిసే అవకాశం వస్తే దానిని మిస్‌ చేసుకోవద్దు. కావాలంటే నీకు ఇతర అభిమానులు కలిసే అవకాశం ఉండవచ్చుగానీ మిస్‌ అయిన వారిని మరలా కలిసే అదృష్టం నీకు దక్కకపోవచ్చు. నీ రిసీవింగే ఆ అభిమాని తన జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు. కాబట్టి అభిమానులకే పెద్ద పీట వేయాలని చెబుతారు. ఇక తాజాగా ఇదే విషయమై తరుణ్‌ తల్లి, ఒకనాటి బాలనటి నుంచి హీరోయిన్‌గా నటించిన రోజారమణి చిరంజీవి గురించి చెబుతూ, నాకు తెలిసి ఎవరి బర్త్‌డే అయినా, ఎవరికైనా శుభకార్యం జరిగినా, మ్యారేజ్‌డే అయినా, లేక అవార్డు వచ్చినా నాకు తెలిసి మొదట అభినందిస్తూ వచ్చే కాల్‌ చిరంజీవి గారిదే అయి ఉంటుంది. అలాగే ఎవరికైనా ఏ కష్టం వచ్చినా, దుర్ఘటన జరిగినా కూడా ముందుగా ఆయన నుంచే ఫోన్‌ వస్తుంది. మనం ఎవరి నుంచి ఏమైనా నేర్చుకోవాలని భావిస్తే చిరంజీవిలోని ఈ సుగుణాన్ని అలవర్చుకోవాలి... అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం ఆమె నాడు తరుణ్‌కి చెప్పి, ఈ విషయంలో చిరుని ఆదర్శంగా తీసుకోమని చెప్పి ఉంటే తరుణ్‌ ఇంకా హీరోగా నిలబడేవాడు. కానీ ఒకే ఒక్క హిట్‌తో ఆయన చూపించిన అహంభావమే ఆయనకు సినిమా అవకాశాలను, ఆయన అభిమానులను హర్ట్‌ చేసిందని ఇండస్ట్రీలోని అందరు చెప్పుకుంటూ ఉంటారు. 

Megastar Chiranjeevi Greatness Revealed by Roja Ramani

roja ramani
chiranjeevi
greatness
fans