Advertisementt

'1' నేనొక్కడినే పై సుకుమార్‌ వివరణ!

Wed 04th Apr 2018 03:24 PM
sukumar,1 nenokkadine,rangasthalam,thanks meet  '1' నేనొక్కడినే పై సుకుమార్‌ వివరణ!
Sukku Clarity about Mahesh 1 Nenokkadine '1' నేనొక్కడినే పై సుకుమార్‌ వివరణ!
Advertisement
Ads by CJ

సుకుమార్‌ తన ప్రతి చిత్రంలో ప్రేక్షకుల ఐక్యూకి టెస్ట్‌ పెడతాడని, లెక్కల మాష్టారుగా తనకున్న తెలివిని సినిమాలలో చూపించే ఇంటెలిజెంట్‌ డైరెక్టర్  అనిపించుకోవాలనే తపన ఆయనలో అధికమని మొదటి నుంచి సుకుమార్‌ విషయంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. 'ఆర్య, జగడం, 100%లవ్‌, ఆర్య2, నాన్నకు ప్రేమతో' మరీ ముఖ్యంగా మహేష్‌తో తీసిన '1'(నేనొక్కడినే), చిత్రాలు ఇవి నిజమని నిరూపించాయి. ఇక ఆయన ప్రతి చిత్రం సమయంలో కూడా ఇందులో ప్రేక్షకులకు అర్ధం కాని పజిల్స్‌ ఏమి ఉండవని, ఇది ఓ సాధారణ కథతో రూపొందిందని చెబుతూనే ఉన్నా, సినిమా విడుదలైన తర్వాత చూస్తే మాత్రం యథా సుకుమార్‌ అన్నట్లుగానే ఈ చిత్రాలు ఉండేవి. అయితే ఆయనకు ఏ క్లాస్‌ ఆడియన్స్‌, మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌, ఓవర్‌సీస్‌లో అభిమానులు, ఆయన్ను ఇష్టపడే ప్రేక్షకుల సంఖ్య మాత్రం అధికమే. కానీ ఆ వర్గం చాలా చిన్నది. దాంతో ఆయన చిత్రాలు బాగున్నాయని పేరు వచ్చినా, టివి చానెల్స్‌లో ప్రసారమయ్యే సమయంలో మంచి టీఆర్పీలు సాధించినా కూడా పక్కాగా కమర్షియల్‌ హిట్స్‌ మాత్రం ఆయనకు తక్కువే. 

ఇక ఈ 14ఏళ్లలో ఆయన చేసినవి కేవలం ఏడే చిత్రాలు కావడం గమనార్హం. అయితే సుకుమార్‌ ఇంత కాలానికి గాను తన మాట మీద నిలబడ్డాడు. 'రంగస్థలం' చిత్రం ఓ సింపుల్‌ స్టోరీ అని, ఓ పీరియాడికల్‌ మూవీగా సాగుతుందని, ఇందులో ప్రేక్షకులకు అర్ధం కాని ట్విస్ట్‌లంటూ ఏమీ ఉండవని చెప్పిన మాట నిజం చేశాడు. పక్కా ఊరమాస్‌ కథను అంతే కొత్తగా స్టైలిష్‌గా చూపించిన భారీ విజయం అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా సుకుమార్‌ మాట్లాడుతూ, 'జగడం' సమయంలో నాకు మెచ్యూరిటీ లేదు. 'జగడం' సినిమా నుంచి ఏమి మారుస్తారు? అని అడిగితే ఆడియన్స్‌ను  మారుస్తానని కోపంగా చెప్పాను. కానీ '1' నేనొక్కడినే విషయంలో మాత్రం నేను ప్రేక్షకులను తప్పు పట్టలేదు. ఆ చిత్రంలో నేను చేసిన లోపాలను గుర్తించాను కాబట్టే ఇప్పుడు 'రంగస్థలం' వంటి చిత్రం తీయగలిగాను. '1' నేనొక్కడినే విషయంలో మాత్రం నేను ఎప్పుడు ప్రేక్షకులను నిందించలేదు అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి సుకుమార్‌లో వచ్చిన ఈ మార్పు అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది.

Sukku Clarity about Mahesh 1 Nenokkadine:

Sukumar About 1 nenokkadine at Rangasthalam Thanks Meet

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ