Advertisementt

షాపింగ్‌ మాల్‌లో కూడా కన్ను గీటుతోంది!

Wed 04th Apr 2018 11:46 AM
priya prakash varrier,shopping mall,social media  షాపింగ్‌ మాల్‌లో కూడా కన్ను గీటుతోంది!
Priya Prakash Warrior one More Video Viral in SM షాపింగ్‌ మాల్‌లో కూడా కన్ను గీటుతోంది!
Advertisement
Ads by CJ

ఈమద్య కాలంలో ఒకే ఒక్క పాటలోని కొన్ని సెకండ్ల వీడియోలో తన హావభావాలతో ప్రేక్షకులను, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న మలయాళీ కుట్టి ప్రియా వారియర్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినీ అభిమానులను, గ్లామర్‌ ప్రియులను ఈమె కొన్ని సెకండ్ల వీడియో, కన్నుగీటుతో బుట్టలో పడేసింది. గతంలో కూడా కొందరు ఇలాగే పాపులర్‌ అయినా రోజులు గడిచే కొద్ది వారిని అందరు మర్చిపోయారు. ఎందుకంటే సెలబ్రిటీ హోదా రావడం ఎంత కష్టమో. దానిని అలాగే మెయిన్‌టెయిన్‌ చేస్తూ రావడం కూడా అంతే కష్టం. ఈ విషయంలో ప్రియా నాలుగాకులు ఎక్కువే చదివింది. ఇక ఈమె ఇప్పుడు ఏ పని చేసినా అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

తాజాగా ఈమె తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి షాపింగ్‌ మాల్‌కి వచ్చింది. వచ్చిన వెంటనే ఆమెని గుర్తుపట్టిన వారు ఆమె కదలికలను వీడియోలు, ఫొటోలు తీశారు. ఇక క్యాజువల్‌గా రెడ్‌ కలర్‌డ్రస్‌లో వచ్చిన ఈమె కూడా ఎవ్వరికీ నో చెప్పకుండా అడిగిన వారందరితో సెల్ఫీలు దిగి వారిని ఆనంద పరిచింది. ఇక ఈమె ఎస్కెలేటర్‌ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు. షాపింగ్‌ చేసే సమయంలో తీసిన వీడియోతో పాటు పిక్స్‌ కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అవుతోంది. దీనిని బట్టి ఒక్క సినిమా కూడ రిలీజ్‌ కాకుండా ఆమె సాధించిన క్రేజ్‌, ఇమేజ్‌ ఇంకా పదిలంగా ఉన్నాయని, ఈ చిత్రం విడుదల వరకు ఇవి కంటిన్యూ కావడం ఖాయమని తెలుస్తోంది. మరి సినిమా విడుదలైన తర్వాత ఆమె ఈ క్రేజ్‌ని నిలబెట్టుకుంటుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...!

Priya Prakash Warrior one More Video Viral in SM:

Priya Prakash Shopping Mall Video Hulchal in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ