రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చూపుతుంటే మరోవైపు ఈ సినిమాకు సంబంధించి కొత్త వివాదం తెరపైకి వచ్చింది. లేటెస్ట్ గా ఈ సినిమా ఆల్బంలో పాడిన శివనాగులు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై మండిపడ్డారు.
ఈ సినిమాలో 'ఆ గట్టునుంటావా... ఈ గట్టుకొస్తావా' సాంగ్ ఒరిజినల్ గా శివనాగులు పాడాడు. అయితే సినిమాలో శివనాగులుకి బదులు దేవిశ్రీ ప్రసాద్ పాడటంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవి..శివనాగులను వేదికపైకి పిలిచి, ఆ పాటను పాడించారు. అందరు శివనాగులు వాయిస్ కి ఫిదా అయిపోయారు. తీరా సినిమాలో చూస్తే దేవి వాయిస్ రావడంతో అటు శివనాగులుతో పాటు ఇటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.
లేటెస్ట్ గా ఓ టీవీ ఛానల్ కి వెళ్లిన శివనాగులు... 'చిన్న చిన్న వేదికలపై పాటలు పాడుకునే తానూ.. ఒక్కసారిగా రంగస్థలం లాంటి పెద్ద సినిమాలో పాడే అవకాశం వచ్చిందంటే చాలా ఆనందం అనిపించింది. నాకు ఇలా అవకాశం వచ్చిందని అందరితో పంచుకున్న. కానీ సినిమా విడుదలయ్యాక తన వాయిస్ లేకపోవడం తనను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన వాయిస్ ను మార్చుతున్నట్టు తనకు ఒక్క మాటైనా చెప్పి ఉంటే బాగుండేదని అన్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తనపై ప్రశంసలు కురిపించిన దేవిశ్రీ.. పది రోజుల్లోనే తన ఆశలపై నీళ్లు చల్లారని చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఇంకా ఎవరికి రాకూడదనే ఉద్దేశంతోనే నేను మీడియా ముందుకు వచ్చానని అయన తెలిపారు'.