Advertisementt

రాజశేఖర్‌ ఆ పాత్రని మోయగలడా..?

Tue 03rd Apr 2018 09:33 PM
rajasekhar,ntr biopic,chandrababu naidu role  రాజశేఖర్‌ ఆ పాత్రని మోయగలడా..?
Is he CBN in NTR? రాజశేఖర్‌ ఆ పాత్రని మోయగలడా..?
Advertisement
Ads by CJ

రాజశేఖర్‌కి వాయిస్‌ బాగుండదు. ఆయన డబ్బింగ్‌ మీదనే ఆధారపడతాడనే విషయం తప్పితే నటునిగా అన్ని రకాల పాత్రలను మెప్పించే సత్తా ఆయనలోఉంది. 'తలంబ్రాలు'లో కూల్‌విలనిజం చేసినా, 'అంకుశం, మగాడు' వంటి చిత్రాలలో పవర్‌ఫుల్‌ పాత్రలను చేసినా, 'అల్లరిప్రియుడు, గోరింటాకు' వంటి చిత్రాలలో ప్రియుడిగా, అన్నాచెల్లెల సెంటిమెంట్‌ను పండించినా ఆయన సినిమాలు ఫ్లాప్‌ అయి ఉండవచ్చు గానీ ఆయన నటునిగా ఎప్పుడు ఫెయిల్‌ కాలేదు. ఇక గత కొంతకాలం బాలకృష్ణకి రాజశేఖర్‌ మద్య మంచి సాన్నిహిత్యం పెరిగింది. రాజశేఖర్‌ నటించిన 'పీఎస్వీగరుడవేగ' చిత్రం వేడుకకు బాలయ్య హాజరయ్యాడు. ఇక బాలయ్య ఎన్టీఆర్‌ బయోపిక్‌ లాంచ్‌కి పోయిన నెల 29న జరిగిన వేడుకకు రాజశేఖర్‌ హాజరయ్యాడు. ఇక త్వరలో రాజశేఖర్‌, జీవితలు బాలయ్య సమక్షంలో తెలుగుదేశం తీర్దం పుచ్చుకోనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

ఇక బాలకృష్ణ తేజ దర్శకత్వంలో తీసే 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో రాజశేఖర్‌ కూడా నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. నిన్నటి దాకా రాజమౌళి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో చేసే మల్టీస్టారర్‌లో రాజశేఖర్‌ పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్ర చేయనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ వాటిని జీవిత ఖండించింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌ బయోపిక్‌లో చంద్రబాబు పాత్రలో రాజశేఖర్‌ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ అన్న తర్వాత చంద్రబాబు పాత్ర లేకుండా కథ సాగడం అసాధ్యం. అయితే నందమూరి ఫ్యామిలీలో అందరికంటే చంద్రబాబు బాలయ్యకే ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందునా బావ, వియ్యంకుడు కూడా. కాబట్టి ఇందులో చంద్రబాబు పాత్ర చిత్రీకరణ పాజిటివ్‌గానే ఉంటుందనేని స్పష్టం. మరి ఈ పాత్రను రాజశేఖర్‌ పోషించనున్నాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...!

Is he CBN in NTR?:

Chandrababu Confirmed For NTR?  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ