Advertisementt

ఎమోషన్‌లో ఉద్వేగానికి లోనైన సన్నీ!

Tue 03rd Apr 2018 09:16 PM
sunny leone,mails,21 years,emotion  ఎమోషన్‌లో ఉద్వేగానికి లోనైన సన్నీ!
Sunny Leone: I Started Getting Hate Mails At 21 ఎమోషన్‌లో ఉద్వేగానికి లోనైన సన్నీ!
Advertisement
Ads by CJ

సన్నిలియోన్‌కి ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో భారతీయ నటీమణులుగా పేరున్న వారికి పెద్దగా తేడా ఏమీ లేదు. సన్నిపై పోర్న్‌స్టార్‌ అనే ముద్ర పడింది. కానీ ఆమె కన్నా ఘోరంగా ఎందరో మన నటీమణులు, సంప్రదాయాలు, మహిళా స్వేచ్చ, భారతీయ విలువల గురించి లెక్చర్లు ఇచ్చేవారు ఇంకా అతి దారుణంగా ఫొటో షూట్స్‌ పేరుతో రెచ్చిపోతున్నారు. ఇక సన్ని పోర్న్‌స్టార్‌ కావడం వెనుక కూడా ఎంతో ఎమోషనల్‌ బ్యాక్‌డ్రాప్‌ ఉంది. దాంతో ఆమె జీవిత గాథని 'కరణ్‌జీత్‌-ద అన్‌టోల్డ్‌ స్టోరీ'లో చూపించనున్నారు. ఇది వెబ్‌సిరీస్‌గా ప్రసారం కానుంది. సన్నిలియోన్‌ అసలు పేరు కరణ్‌జీత్‌. ఆమె ఓ మధ్యతరగతి సిక్కు కుటుంబం నుంచి వచ్చింది. ఈమెని మీరు మొదటి సారి మన దేశం వచ్చినప్పుడు తీవ్రమైన అవమానాలను ఎదుర్కొన్నారట కదా...! అని ప్రశ్నిస్తే అప్పుడే కాదు అంతకు ముందే నా వయసు 21 ఏళ్లు ఉన్నప్పటి నుంచి అవమానాలు, ఎగతాళులు ఎదుర్కొంటూనే ఉన్నాను. 

ఆ వయసులో నన్ను ద్వేషిస్తూ, ధూషిస్తూ ఎన్నో భయంకరమైన మెసేజ్‌లు వచ్చేవి. ఆ వయసులో అలాంటి మెసేజ్‌లు జీవితంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి. మనల్ని కుంగతీస్తాయి. కానీ ఆ సమస్యను నా కుటుంబం నుంచి వచ్చిన ప్రోత్సాహం ద్వారా ఎదుర్కొన్నాను. నేను ఎంచుకున్న రంగం వారికి ఇష్టం లేకపోయినా వారు నాకు అండగా నిలిచారు. నా జీవితం ఎలా ఉన్నా నేను ప్రేమిస్తాను. జరిగేవన్నీ మన మంచికే అని పెద్దలు అనేది అందుకే. నేను పడిన కష్టాలు నా పిల్లలు పడకూడదు అని ఉద్వేగానికి లోనైంది. కాగా ఈమె ముంబైలోని ముగ్గురు ఆడపిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. మనిషి ఏ పని చేసినా ప్రతి వారికి ఎమోషన్స్‌ ఉంటాయనే దానికి సన్ని పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు.

Sunny Leone: I Started Getting Hate Mails At 21:

Sunny Leone says her 21 Years Old Story 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ