Advertisementt

చరణ్, ఎన్టీఆర్.. మధ్యలో రాజమౌళి లేడంతే!

Tue 03rd Apr 2018 06:59 PM
ram charan,rangasthalam,sukku,jr ntr,ss rajamouli  చరణ్, ఎన్టీఆర్.. మధ్యలో రాజమౌళి లేడంతే!
Charan, NTR, Sukku Pic Hulchal in Social Media చరణ్, ఎన్టీఆర్.. మధ్యలో రాజమౌళి లేడంతే!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దర్శకుడు రాజమౌళి అనేక సంచలనాలకు తెర తీసాడు. ఎంత అనుబంధం లేకపోతే అలా ఫోటో దిగుతారు. వీరి కాంబోలో ఒక బడా మల్టీస్టారర్ అంటూ బోలెడన్ని న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. నిజంగా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లను అలా ఫోటోలో చూసిన వారికి కడుపు నిండిపోయింది అంటే అతిశయోక్తి లేదు. ఒకే ఒక్క ఫోటో అనేక రకాల గాసిప్స్ కి నెలవు అయ్యింది. అయితే ఆ ఫోటో వచ్చిన చాన్నాళ్ళకి #RRR అంటూ ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి కాంబోలో బడా మల్టీస్టారర్ ఖాయమయ్యింది.

అయితే అలాంటి మరో ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈసారి ఫొటోలో డైరెక్టర్ మారాడు... మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నట్టుగా వుంది. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాతో తిరుగు లేని హిట్ కొట్టాడు. మరి రంగస్థలంలో చిట్టిబాబుగా చరణ్ చేసిన యాక్టింగ్ కి ఎన్టీఆర్ ఫిదా అయ్యి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. రంగస్థలం చూసాను.. అందులో చరణ్ నటన అద్భుతం అంటూ పొగిడిన ఎన్టీఆర్... సుకుమార్ అండ్ రంగస్థలం టీమ్ అందరిని పేరుపేరునా పొగిడేసాడు. ఎన్టీఆర్ అలా సూపర్ అంటూ ట్వీట్ చేసాడో లేదో... చరణ్ కూడా థాంక్యూ బ్రదర్ అంటూ రిప్లై కూడా ఇచ్చేసాడు.

అయితే ఇది జరిగిన తర్వాత దర్శకుడు సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ అకౌంట్ నుండి ఒక ఫోటో పోస్ట్ చేసాడు. అందులో ఎన్టీఆర్, సుకుమార్, చరణ్ లు ఎంతో క్లోజ్ గా దిగిన ఫోటో ఉంది.  మరి ఈ ఫోటో చరణ్ చిట్టిబాబు లుక్ లోనే అంటే గుబురు గడ్డంతో ఉండడం చూస్తే... మాత్రం ఇది పాత ఫోటో అని తెలుస్తోంది. అయితే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో క్లోజ్ గా కూర్చొని దిగిన ఫోటోకి వచ్చినంత పాపులారిటీ ఇప్పుడు సుక్కు, ఎన్టీఆర్, చరణ్  ఫోటోకి వచ్చేస్తోంది. మరి రాజమౌళిలా సుకుమార్ తో కూడా ఈ హీరోలు అంతే చనువుగా భుజం మీద చేతులేసి ఫోటోకి ఫోజు ఇవ్వడం చూస్తుంటే వీరి కాంబోలో కూడా ఏమన్నా మల్టీస్టారర్ ఉండబోతుందో ఏమో తెలియదు గాని ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది.

Charan, NTR, Sukku Pic Hulchal in Social Media:

Rumours on Charan, NTR and Sukku Selfie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ