మెదడుకు పదును పెట్టే, ప్రేక్షకుల జీకేని అంచనా వేసే చిత్రాలనే కాదు.... అవసరమైతే డిఫరెంట్ నేపధ్యాన్ని ఎంచుకుని, మాస్ ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అయ్యే సింపుల్ కథలతో కూడా తాను మ్యాజిక్ చేయగలనని దర్శకుడు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిరూపించుకున్నాడు. ఈయన నటించిన 'రంగస్థలం' చిత్రానికి అద్భుతమైన టాక్, అంతకు మించిన వసూళ్లు వస్తున్నాయి. పెద్దగా ప్రమోషన్ లేకుండానే సినిమా విడుదల కావడంతో కొందరు అనుమాన పడి పలు విధాలుగా సందేహించారు. కానీ కంటెంట్ సరిగా ఉంటే ప్రేక్షకులు ప్రమోషన్స్ లేకపోయినా బ్రహ్మరథం పడుతారని ఈ చిత్రం నిరూపిస్తోంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఎంతో కాలం తర్వాత వచ్చిన క్లాసిక్ చిత్రంగా 'రంగస్థలం'ని చెప్పుకుంటున్నారు. ఇక సుకుమార్ కూడా 'రంగస్థలం'కి వస్తున్న టాక్, పాజిటివ్ రివ్యూలు, మౌత్‌టాక్, కలెక్షన్ల పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇక గతంలో సుకుమార్ తన కెరీర్‌లోనే మొదటి చిత్రంగా పెద్ద హిట్ కొట్టిన అల్లుఅర్జున్ 'ఆర్య'కి కొనసాగింపుగా 'ఆర్య 2' చిత్రం చేశాడు. ఇది బాగా ఆడలేదు. ఇక ఈయన కెరీర్‌లో 'జగడం, 1( నేనొక్కడినే)' వంటి ఫ్లాప్‌లు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు సుకుమార్ 'రంగస్థలం'తో తిరుగేలేని విజయం సాధించాడు. ఇక ఈయన నిర్మాతగా కూడా నిర్మించిన మొదటి చిత్రం 'కుమారి 21 ఎఫ్' పెద్ద హిట్ అయినా తర్వాత వచ్చిన 'దర్శకుడు' పెద్దగా ఆడలేదు.
ఇక విషయానికి వస్తే సుకుమార్ తదుపరి చిత్రం ఎవరితో అనేది టెన్షన్‌ని కలిగిస్తోంది. సాధారణంగా లేటుగా సినిమాలు తీసినా కూడా తన తదుపరి చిత్రం ఎవరితో అనే విషయంలో సుకుమార్ చాలా హింట్స్ ఇస్తాడు. కానీ ఈసారి మాత్రం ఆయన ఏమాత్రం తన తదుపరి చిత్రం గురించి మాట్లాడటం లేదు. 'రంగస్థలం' విడుదలైన తర్వాత ఆలోచించి, తర్వాత ఎవరితో అనేది నిర్ణయించుకుంటాడని అంటున్నారు. ఇక 'రంగస్థలం' కథని తాను చాలా తక్కువ రోజుల్లోనే పూర్తి చేశానని, కానీ చిట్టిబాబు పాత్ర చెవుడు కావడంతో దానిపై ఎక్కువ కాలం స్టడీ చేశానని, ఇక చిత్రం 1980ల నాటి నేపధ్యం, గ్రామీణ చిత్రం కావడంతో దాని గురించి రీసెర్చ్ చేయడం ఆలస్యమైందని సుకుమార్ చెబుతున్నాడు. ఇక తాజాగా ఆయన్ను మీరు 'రంగస్థలం'కి సీక్వెల్ చేస్తారా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానం ఇస్తూ...ఉంటుందా? ఉండదా? అనేది ఇప్పుడే చెప్పలేను. చేయాలనుకుంటే మాత్రం రామ్‌చరణ్‌ని చెవిటి వాడిగా కాకుండా ఆపరేషన్ జరిగి అంతా బాగా వినపడే విధంగా ఆయన పాత్రను తీర్చిదిద్దుతానని చెప్పడంతో ఆయన చెవిటి వాని పాత్రకు ఎంతగా హోంవర్క్ చేసి అలసి పోయాడో తెలుస్తోంది. ఇక కేవలం ఈ పాత్రలని మాత్రమే తీసుకుని, కొత్త కథతో మాత్రమే సీక్వెల్ చేస్తాను.. చిరంజీవి గారితో చేయడం నా కల. చిరంజీవి గారికి నా కథ నచ్చితే మాత్రం నా కల నెరవేరినట్లేనని తెలిపాడు. ఇక రామ్‌చరణ్ తదుపరి బోయపాటి శ్రీను, రాజమౌళి మల్టీస్టారర్స్ చేయనున్నాడు. సమంత కూడా రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉంది. మరి సుక్కు తన తదుపరి చిత్రం ఎవరితో ? ఎప్పుడు ప్రారంభిస్తాడో? వేచిచూడాల్సివుంది...!