తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాల మార్కెట్ ఎంత ముఖ్యమో ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ కూడా అనే కీలకం అయ్యింది. ఎందుకంటే సినిమా ఇక్కడ శుక్రవారం విడుదలైతే.. ఓవర్సీస్ లో మాత్రం గురువారం సాయంత్రమే ప్రీమియర్స్ పడిపోవడం.. ఆ ప్రీమియర్స్ నుండి వచ్చిన టాక్ తో ఇక్కడ సినిమా హిట్ ఫట్టా అనేది డిసైడ్ అవుతుంది. అలాగే ప్రస్తుతం ఇక్కడి ఏరియాలతో సమానంగా ఓవర్సీస్ లోను కొన్ని సినిమా కలెక్షన్స్ తో అదరగొట్టేస్తున్నాయి. మరి ఓవర్సీస్ లో అలా అదరగొట్టే కలెక్షన్స్ తో బాహుబలి ఒక రేంజ్ రికార్డులను క్రియేట్ చేసింది. మామూలుగానే బాహుబలి పేరిట ఉన్న రికార్డులు ఏ సినిమా పేరు మీదా లేవు.
మరి ఓవర్సీస్ లోను బాహుబలి రికార్డులు అదరగొట్టేశాయి. అలాగే సుకుమార్ సినిమాలకు ఓవర్సీస్ లో ఏ రేంజ్ మార్కెట్ ఉందో వేరే చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సుకుమార్ నుండి వచ్చిన గ్రామీణ నేపథ్యం వున్న రంగస్థలం కలెక్షన్స్ సునామి ఓవర్సీస్ లో వరదలా పారుతుంది. రంగస్థలం ప్రీమియర్స్ రూపంలో 7.06 లక్షల డాలర్లు కొల్లగొట్టిన ఈ సినిమా..... ఫస్ట్ డే, సెకండ్ డే కూడా వసూళ్ల వర్షం కురిపించింది. అయితే రంగస్థలం సినిమా శుక్రవారం కంటే శనివారం నాడు కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయంటే.. సుకుమార్ గారి చిట్టిబాబు ఓవర్సీస్ ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయిపోయాడో అర్ధమవుతుంది.
అలాగే మూడో రోజు అంటే ఆదివారం మొదలైన కొన్ని గంటలకే 2 మిలియన్ల మార్క్ ను అందుకున్న రంగస్థలం బాహుబలి తర్వాత అత్యంత వేగంగా ఈ మార్క్ ను అందుకున్న చిత్రంగా నిలిచింది. అయితే మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన శ్రీమంతుడు కూడా ఆదివారం నాటికి ఈ మార్క్ ను అందుకుంది కానీ.. రంగస్థలం అంతకంటే కొన్ని గంటల ముందే 2 మిలియన్ల మార్క్ ని అందుకుని అదరగొట్టేసింది. మరి అక్కడితో ఆగడం లేదు రంగస్థలం వసూళ్లు ఆదివారం ఎండింగ్ సమయానికి బాగా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇక సోమవారం నుండి కూడా రంగస్థలం కలెక్షన్స్ పడిపోయే అవకాశం లేదని... ఇలాగే కలెక్షన్స్ కొల్లగొడుతూ రంగస్థలం 3 మిలియన్ల మార్క్ ని అత్యంత వేగంగా అందుకోగలదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.