Advertisementt

మహేష్ హీరోయిన్ మతి పోగొట్టేస్తుంది!

Mon 02nd Apr 2018 10:07 PM
mahesh babu,kaira advani,look,bombay times fashion week  మహేష్ హీరోయిన్ మతి పోగొట్టేస్తుంది!
Mahesh BAN Heroine Kaira Advani Photos sensation in SM మహేష్ హీరోయిన్ మతి పోగొట్టేస్తుంది!
Advertisement
Ads by CJ

'భరత్ అనే నేను' లో మహేష్ కి జోడిగా బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తుంది. ఇప్పటికే కైరా అద్వానీ - మహేష్ బాబుల రొమాంటిక్ ఫొటోస్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. 'భరత్ అనే నేను' లో కైరా అద్వానీ... మహేష్ బాబుకి పీఏగా నటిస్తుంది. యంగ్ ముఖ్యమంత్రికి బ్యూటిఫుల్ పీఏ అన్నమాట. మరి ఈ సినిమాలో మహేష్ ఎంతో బాగా యాక్ట్ చేస్తున్నాడని చెప్పడమే కాదు, మహేష్ బాబు షూటింగ్ స్పాట్ లో ఎంతో జోవియల్ గా ఉంటాడని అలాగే.. మహేష్ నుండి తానెంతో నేర్చుకున్నానని ఇలా అనేక విషయాల్లో మహేష్ ని కైరా అద్వానీ తెగ పొగిడిన విషయం తెలిసిందే. అలాగే అసలు 'భరత్ అనే నేను' సినిమా విడుదల కాకముందే అమ్మడు రామ్ చరణ్ - బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది. అమ్మడు అందాలకు తెలుగు ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యేలా కనిపిస్తున్నదని దర్శక నిర్మాతలు బాగా నమ్మబట్టి అమ్మడుకి ఇలా మంచి అవకాశాలొస్తున్నాయంటున్నారు.

ఇక తాజాగా కైరా అందాల విందు బాలీవుడ్ లో బొంబే టైమ్స్ వారు  నిర్వహించిన ఫ్యాషన్ వీక్ లో కనువిందు చేసింది. డిజైనర్ సుభిక డిజైన్ చేసిన డ్రెస్సులో కైరా అద్వానీ బొంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ లో మెరుపు మెరిపించింది. అమ్మడు డిజైనర్ వేర్ డ్రస్సులో కత్తిలా కనబడుతూ అందాల ఆరబోతలో ఆరితేరిపోయిందా అనిపిస్తుంది. మరి ఈ లెక్కన అటు బాలీవుడ్ ని ఇటు టాలీవుడ్ లోను కైరా అద్వానీ గ్లామర్ షో పిచ్చ పిచ్చగా షురూ అయ్యేలా కనబడుతుంది.  కైరా అందాల ఆరబోతకు పడిపోయి దర్శకనిర్మాతలు ఆమెకు మరిన్ని అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

Mahesh BAN Heroine Kaira Advani Photos sensation in SM:

Kaira Advani Look at Bombay Times Fashion Week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ