గతంలో నేను ఏవైతే చేయకూడదని నిర్ణయించుకున్నానో ఇప్పుడు వాటినే చేయాల్సి వస్తోందని బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలను తన బ్లాగ్‌లో రాశారు. ఆయన ఇక ఎప్పుడు జుట్టుకు బదులు విగ్గు, గడ్డం వంటివి లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడట. కానీ 'సై..రా...నరసింహారెడ్ది' చిత్రం కోసం మరలా గడ్డం, జుట్టుని విగ్గుగా పెట్టుకోవాల్సి వచ్చిందని, వాటిని తాను తగిలించుకున్నానని, తన జీవితంలో మరోసారి నరకం అనుభవిస్తున్నానని ఆయన తెలిపాడు. ఇదే సమయంలో కొన్నిసార్లు వ్యక్తిగత, వృత్తిగత అవసరాల రీత్యా ఇవి తప్పవని ఆయన కామెంట్స్ చేశాడు. ఇక నయనతార, సుదీప్, విజయ్‌సేతుపతి, జగపతిబాబు వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక షూటింగ్ కోసం హైదరాబాద్‌కి వచ్చిన అమితాబ్‌కి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తాను ఎవ్వరికీ ఇవ్వని రోల్స్ రాయిల్స్ కారుని చిరు అమితాబ్ కోసం ఇచ్చాడు. ఇక కేవలం రెండు మూడు రోజుల షూటింగ్ కోసం ఆయనకు కోట్లాది రూపాయల పారితోషికం ఇచ్చారు. ఇక తాజాగా అమితాబ్ నటిస్తున్న ఆన్ లోకేషన్ స్టిల్స్, అందులో అమితాబ్, చిరుల గెటప్‌లు దర్శన మిచ్చాయి. వీటిని అమితాబ్ తొందరపడి లీక్ చేశాడని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ 'బాహుబలి'కి ధీటుగా తీస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పటి నుంచే పలు విధాలుగా ప్రమోషన్స్ చేయడం వల్ల సినిమా రిలీజ్ నాటికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న అన్ని భాషల్లో ఈ చిత్రం పట్ల భారీ అంచనాలు నెలకొల్పే విధంగానే ఈ యూనిట్ అమితాబ్ లుక్‌ని లీక్ చేయించిందని తెలుస్తోంది.
ఈ వయసులో, అందునా అమితాబ్ ఓ దక్షిణాది చిత్రంలో నటిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. బాలయ్య అడిగినా నో అనడంతో ఇక 'మనం' కోసం ఏదో మొహమాటం కొద్ది నటించాడని, ఇక ఈయన దక్షిణాదిలో నటించే అవకాశం లేదని అన్నారు. కొందరు 'సై..రా'లో ఆయన నటిస్తున్నాడని వార్తలు వచ్చినా, రెహ్మాన్‌లాగా చివరి క్షణాల్లో తప్పుకోవడం ఖాయమని, ఆల్‌రెడీ తప్పుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ అమితాబ్ తన పాత్రకి సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయడంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. ఇక అమితాబ్‌ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు కోట్లలో ఉన్నారు. ప్రధాని మోదీ తర్వాత ఆయనకే ఎక్కువ ఫాలోయర్స్ ఉన్నారు. అలాంటి అమితాబ్ చేత ఈ లుక్స్‌ని రిలీజ్ చేస్తే కావాల్సినంత పబ్లిసిటీ రావడం ఖాయమని, అందుకే సైరా టీమ్ అలా లీక్ చేయించిందని సమాచారం. ఇక అమితాబ్‌కి ఈ చిత్రం హిందీ వెర్షన్ ప్రచార బాధ్యతలు కూడా అప్పగిస్తే తిరుగే ఉండదని యూనిట్ భావిస్తూ ఉండటం వల్లే ఆయన కోరిన రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే ఇచ్చారని తెలుస్తోంది.